ఈ విశ్వంలో మనుషులకు కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉంటాయి. ఖగోళంలో ఆశ్చర్య పరిచే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అరుదైన సంఘటన ఈరోజు ఆకాశంలో చోటుచేసుకోబోతుంది. ఆ అద్భుతం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఈరోజు పంచగ్రహ కూటమి. అనగా ఆకాశంలో ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనబడతాయి. ఆకాశంలో ఈ అద్భుతం ఈరోజే జరగనుంది.
ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకే లైన్ లో ఉన్నట్లు, చంద్రుడితో పాటు ఆర్క్ రూపంలో కనిపించనున్నాయి. ఆ గ్రహాలు ఏమిటంటే బుధుడు, శుక్రుడు, గురు, అంగారక, యురేనస్. ఈ ఐదు గ్రహాలు చంద్రుడితో కలిసి ఆర్క్ రూపంలో ఇవాల కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుతాన్ని చూడటానికి సైన్స్ మరియు ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పంచగ్రహ కూటమిని సైన్స్ పరంగా 'ఎక్స్ ట్రీమ్ లీ రేర్ ఆస్ట్రానమిక్ ఈవెంట్' గా చెబుతారు.
ఈ దృశ్యాన్ని సూర్యాస్తమయం తర్వాత సాయంత్రపు సమయంలో పశ్చిమ దిశ వైపు నేరుగా చూడవద్దు. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు మనకి కనిపిస్తాయి. ఈ ఐదు గ్రహాల్లో నేరుగా మన కళ్ళతో గురు, శుక్ర, అంగారక గ్రహాలను చూడవచ్చు. మిగిలిన రెండు గ్రహాలైన బుధగ్రహం, యురేనస్ మాత్రం బైనాక్యులర్ తో వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
Big News :పాన్ ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడగింపు ..!
ఈ అద్భుత దృశ్యంలో గురు గ్రహం కంటే కూడా శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. బుధ గ్రహానికి ఎడమ వైపున గురు, శుక్ర గ్రహాలు కనిపిస్తాయి. నేరుగా కంటితో కనిపించేంత ప్రకాశవంతంగా శుక్ర గ్రహం వెలిగిపోనుంది. కానీ యురేనస్ ప్రకాశవంతంగా ఉండకపోవడంతో దీని స్పష్టంగా చూడటానికి బైనాక్యులర్ ఉపయోగించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈరోజు కనబడే పంచ గ్రహ కూటమి చాల అరుదైనది ఎందుకంటే మిగిలిన నాలుగు గ్రహాలకంటే యురేనస్ గ్రాహం అనేది భూమి పైనుంచి కనబడనుంది. యురేనస్ గ్రాహం సూర్యుడి చుట్టూ తిరిగిరావడానికి 84 సంవత్సరాలు పడుతుంది, మళ్ళి ఇలా వరుసలో రావటానికి 84 సంవత్సరాలు ఎదురుచూడాలి. కాబట్టి సాధారణంగా కంటితో కనిపించని యురేనస్‌ను చూసేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments