ఇంకా పూర్తిగా 2 ఏళ్ళు కుడా దాటలేదు ఈ చిన్నారి కి, అప్పుడే ప్రపంచ స్థాయి లో అవార్డులు అందుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్నాడు, నోరువెళ్ళ బెట్టేలా చేస్తున్నాడు . హైద్రాబాదుకు చెందిన అర్హాన్ సాయి గౌరిశెట్టి, (18 నెలల వయసు ) ఇంత చిన్న వయసులోనీ నాలుగు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులు, అలానే మారేన్నో పురస్కారాలను అందుకున్నాడు.
ఇంతకి ఇన్ని అవార్డులు దేంట్లో సాధించాడో తెలుసా? కాంటెంపరరీ ఫ్లూయిడ్ ఆర్ట్ లో . ఒకటి కాదు రెండు కాదు ఈ బుడతడు మొత్తం 43 టెక్నిక్లను ఉపయోగించి 50 కాంటెంపరరీ ఫ్లూయిడ్ ఆర్ట్ పెయింటింగ్స్ ని చిత్రీకరించాడు . ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,ఆసియ బుక్ అఫ్ రికార్డ్స్ , ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్, మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించాడు.
ఒకటిన్నర సంవత్సరాల పిల్లోడు పెయింటింగ్స్ చేయడం అసాధ్యం అని అనుకుంటున్నారా! ఇది సాధారణ చిత్రకళకు కొద్దిగ్గా భిన్నమయింది . సాంప్రదాయ పెయింటింగ్స్ లో బ్రష్ ను ఉపయోస్తారు , ఫ్లూయిడ్ ఆర్ట్ లో బ్రష్ తో కాకుండా టెక్నిక్స్ ను ఉపయోగించి రంగులతోనే చిత్రాన్ని సృష్టిస్తారు.
అర్హాన్ తల్లి స్నేహలత మాట్లాడుతూ, "అర్హాన్ ను చిన్న వయసులోనే , సెన్సారీ ఆక్టివిటీస్ లో భాగంగా చిత్రకళకు పరిచయం చేసాము , మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉండటంతో సెలవు రోజుల్లో ఇంట్లో ఇలాంటి ఆక్టివిటీస్ చేయించేవాళ్ళం , అర్హాన్ కు మాత్రం మిగతా ఆటల కన్నా పెయింట్స్ లో చిత్రకళలో ఆసక్తి ఉండడం మేము గమనించాము
ఇది కుడా చదవండి ..
గంజాయి పంటను చట్టబద్ధం చేయనున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా?
అర్హన్ వయసు చాలా చిన్నది అందుకే బ్రష్ ని ఇంకా చేయడం రాదూ కాబట్టి ఫ్లూయిడ్ ఆర్ట్స్ తనకి పరిచయం చేసాం. మేము తల్లిదండ్రులుగా పక్కన ఉండి రంగులు అందిస్తాము తప్ప ఎలాంటి గైడెన్స్ కూడా అందించాము. అర్హాన్ తన సొంతంగానే చాల శ్రద్ధగా పెయింటింగ్స్ ను పూర్తిచేస్తాడు. తాను రంగులతో ఆడుకుంటాడనే మెం అనుకున్నాం కానీ ఆ చిత్రాలు అంత బాగా తయారవ్వడం మకుడా ఆశ్చర్యమే .. అని తెలిపారు. అర్హన్ తండ్రి గౌరిశెట్టి అనిల్ సాయి మాట్లాడుతూ, అర్హాన్ ఎప్పుడు కాన్వాస్ కు బయట రంగులు పడేసింది కుడా లేదు , ట్రైనింగ్ ఇచ్చేంత వయసు కూడా కాదు తనది , తను ఎం చేసిన అది సహజంగా వస్తున్నదే అని అన్నారు.
ఇది కుడా చదవండి ..
Share your comments