News

ప్రపంచంలోనే శాకాహారం తినే అనంత పద్మనాభ స్వామి మొసలి మరణించింది..

Srikanth B
Srikanth B
ప్రపంచంలోనే శాకాహారం తినే అనంత పద్మనాభ స్వామి మొసలి మరణించింది..
ప్రపంచంలోనే శాకాహారం తినే అనంత పద్మనాభ స్వామి మొసలి మరణించింది..

దేవుడి మొసలిగా పేరుగాంచిన కాసరగోడ్ అనంత పద్మనాభ దేవాలయంలో ఉన్న "బాబియా" అనే మొసలి మృతి చెందిన విషయం తెలిసిందే. సుమారు 70 సంవత్సరాల వయసు కల్గిన ఈ మొసలి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మొసలి యొక్క ప్రత్యేకత ఇది కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తుంది . ముఖ్యం గ గుడిలో స్వామి వారికీ సమర్పించే నైవేద్యం మాత్రమే స్వీకరిస్తుంది .

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని అనంతపుర సరస్సు ఆలయానికి బాబియా మొసలి కాపలాదారు. స్థల పురాణాల ప్రకారం, ప్రతిరోజూ దేవుడి మధ్యాహ్న పూజ తర్వాత అందించే ఆలయ ప్రసాదాన్ని మాత్రమే బబియా మొసలి తినేది .

భక్తులతో స్నేహపూర్వకంగా మెలిగే ప్రపంచంలోనే ఏకైక శాకాహార మొసలి గ ఏది ప్రసిద్ధి చెందింది , దీనితో ఒక్కసారిగా ఈ వార్త విన్న భక్తులు తీవ్ర దిగ్బ్రాంతి కి గురవుతున్నారు.

నోబెల్ అవార్డు2022 : వైద్య రంగం లో "స్వాంటే పాబో"ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..

2 ఏళ్ల క్రితం తొలిసారిగా నీటిలో నుంచి బయటకు వచ్చిన బాబియా మొసలి ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంత పద్మనాభ ఆలయ ప్రాంగణంలో మొసలి బాబియా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

నోబెల్ అవార్డు2022 : వైద్య రంగం లో "స్వాంటే పాబో"ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..

Share your comments

Subscribe Magazine

More on News

More