News

జగనన్న వసతి దీవెన కింద ఆంధ్ర ప్రభుత్వం రూ.1,024 కోట్లు పంపిణీ !

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2021-22 సంవత్సరానికి విద్యార్థులకు బోర్డింగ్ మరియు లాడ్జింగ్ ఛార్జీలతో సహాయపడే స్కీమ్ జగనన్న వసతి దీవెన కింద రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది విద్యార్థుల తల్లులకు శుక్రవారం రూ.1,024 కోట్లు పంపిణీ చేశారు.

 

“ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందేలా మా ప్రభుత్వం హామీ ఇస్తుంది. వారు ఇతర విషయాల గురించి కలవరపడకుండా చదువులపై మాత్రమే దృష్టి సారించాలి” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

పేదరికంతో విద్యార్థులెవరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదని, పిల్లల చదువుల ఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగన వసతి దీవెన కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది.

 

పథకం కింద, ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు వాయిదాలలో చెల్లింపును అందజేస్తుంది కాబట్టి విద్యార్థులు తమ బోర్డింగ్ మరియు లాడ్జింగ్ ఖర్చులను చూసుకోవచ్చు. ఐటీఐ విద్యార్థులు రూ. 10,000, పాలిటెక్నిక్ రూ. 15,000, డిగ్రీ, ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ విద్యార్థులకు రూ. 20,000 వరకు అందు కుంటారు .

గత  ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి, “ఇటీవల, జగనన్న విద్యా దీవెన ద్వారా 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వం మొత్తం రుసుము రూ.709 కోట్లను రీయింబర్స్ చేసింది.” "మా ప్రభుత్వం ఏర్పడిన 34 నెలల్లో, గత ప్రభుత్వం ఉంచిన రూ. 1,778 కోట్లు మరియు జగనన్న వసతి దీవెన కింద రూ. 3,329 బకాయిలతో కలిపి రూ. 6969 కోట్లు జగనన్న  విద్యా దీవెన  పథకం కింద జమ చేయబడ్డాయి," అని ముఖ్య మంత్రి తెలిపారు.

శ్రీ రామనవమి సందర్భం గ ఆదివారం హైదరాబాద్ లో మద్యం దుకాణాలు, బార్లు బంద్!

Share your comments

Subscribe Magazine

More on News

More