News

ఖరీఫ్ సీసన్ 2024: ఆంధ్రలో సాగు విస్తీర్ణం ఎంత? దిగుబడి ఎంత?

KJ Staff
KJ Staff

మరికొద్ది రోజుల్లో మే నెల పూర్తికావస్తోంది, ఖరీఫ్ సీసన్ పంట మొదలవ్వడానికి ఇంకా కొద్దీ రోజులు మాత్రమే ఉంది. దాదాపు రెండు నెలల పాటు ఖాళీగా ఉన్న పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకునే సమయమిది. మరోపక్క రైతులు కూడా ఖరీఫ్ సీసన్ కోసం సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు వ్యవసాయశాఖ కూడా రానున్న ఖరీఫ్ సీజన్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

రానున్న సీజన్లో మొత్తం 34.26 లక్షల హెక్టర్లలో పంటల చెయ్యడం ద్వారా 167.15 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తుంది. దీనికి తోడు ఈ ఏడాది వర్ష శాతం కూడా ఎక్కువగా ఉండటం చేత, ఈ అంచనాలన్నీ బలపడటానికి ఆస్కారముందని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా సాగుచేసే పంటల్లో ధాన్యం ఒకటి, రానున్న సీజన్లో కూడా అధిక విస్తీర్ణంలో వరి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు, రాష్ట్రం మొత్తం మీద కనీసం 15.63 లక్షల హెక్టర్లలో వరి సాగుతుంటుందని, దీని ప్రకారం ఒక హెక్టర్లో కనీసం 5,470 కేజీల దిగుబడి పొందగలిగితే, రాష్ట్రం మొత్తంలో 85.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరుగుతుందని భావిస్తున్నారు.

వరి పంటతో పాటు మిగిలిన పంటలకు కూడా అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు. మొత్తం 24 రకాల పంటలకు ఈ యాక్షన్ ప్లాన్ లో పొందుపరచగా అన్ని పంటల్లోకెల్లా వరి సాగుకే అధిక ప్రాధాన్యం ఉందని తెలుస్తుంది. ఆహార ధన్యులైన వరి, గోధుమలు, మొదలైన 20.02 లక్షల హెక్టర్లలో సాగుచేస్తారని, ఆసక్తికరంగా నూనె గింజల పంటలు 6.58 లక్షల హెక్టర్లలో సాగుజరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది, దీనిని బట్టి, నూనె గింజల దిగుబడి అధికంగా ఉండబోతుందని తెలుస్తుంది. 3.34 లక్షల హెక్టర్లలో తృణ ధాన్యాలు సాగుచెయ్యనుండగా చిరు ధాన్యాల పంట 2.19 లక్షల హెక్టర్లకు పరిమితం కానున్నది. మిగిలిన వాణిజ్య పంటల సాగు 6 లక్షల హెక్టర్లలో సాగు జరగొచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సాగు దిగుబడితో పాటు సాగు విస్తీర్ణం కూడా పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారాలు నమ్మకంవ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో మరో నాలుగు లక్షల ఎకరాల్లో అధనంగా సాగుజరుగుతుందని భావిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More