News

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, అర్హతలు ఇవే...

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వారుకు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి మళ్ళి ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నారు, రేషన్ కార్డు రంగుల మీద కూడా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను కూడా తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది, త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్లో ప్రభుత్వ మార్పుతో అన్ని విధివిధానాల్లో మార్పులుచేర్పులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, కొత్త రేషన్ కార్డుల జారీ పై ఫోకస్ పెట్టింది. మునపటి ప్రభుత్వం జారీచేసిన రేషన్ కార్డుల స్థానాల్లో కొత్త రంగులతో కార్డులు జారీచెయ్యలని యోచిస్తోంది. దినికి సంబంధించిన కొన్ని డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డులు చలామణిలో ఉన్నాయి, వీటిలో 90 లక్షల కార్డులను మాత్రమే బిపిఎల్ కార్డులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వీటికి మాత్రమే కేంద్రం ప్రభుత్వం ఆహారభద్రత చట్టం కింద రాయితీలు అందిస్తుంది. మిగిలిన కార్డుల పై సబ్సిడీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఇప్పుడు వీటిలో కూడా కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది, వాడుకలో లేని కార్డులను నిలిపివేయడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది.

2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండేవి, గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ సంఖ్యా 1.48 కోట్లకు పెరిగింది, అంటే 1.10 లక్షల కొత్త కార్డులు చేరాయి. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం 78 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, రేషన్ కార్డులో మార్పులు కోసం చేసిన దరఖాస్తులు 3.36 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులతో పాటు కొత్తగా పెళ్ళైన దంపతులు, మరియు అర్హత ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం విధివిధానాలను సిద్ధం చేస్తుంది.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం కుటుంబాల దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి, ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. ఈ కార్డులను తొలగించి వీటి సస్థానంలో కొత్త కార్డులను భర్తీ చెయ్యవచ్చు. నిరుపయోగంగా పడి ఉన్న కార్డులను తీసెయ్యడం ద్వారా ప్రభుత్వానికి ప్రతీ ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌరసరఫరా శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కొత్త ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Share your comments

Subscribe Magazine

More on News

More