2024, ఆంధ్ర ప్రదేశ్లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, పథకాల అమలులో కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మర్చి, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దీనితోపాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అన్ని అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులకు అందించిన వైఎస్ఆర్ రైతు భరోసా పేరును మార్చి, అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి సంబంధించిన వెబ్సైట్లో ఇప్పటికే పేర్లు మార్చడం జరిగింది. దీనితో పాటు మంత్రివర్గంతో భేటీ అయినా చంద్రబాబు, రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయం గురించి కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే అన్నదాత సుఖీభవ అన్న ఈ పథకాన్ని తెలుగు దేశం ప్రభుత్వం 2019, లో తీసుకువచ్చింది, 2019, లో ప్రభుత్వం మరీనా తరువాత దీనికి వైఎస్ఆర్ రైతు భరోసాగా మార్చడం జరిగింది. 2024, సార్వత్రక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్సిక్స్ పథకంలో భాగంగా రైతులకు ప్రతీ ఏటా రూ.20,000, ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని త్వరలోనే అమలులోకి వచ్చేలా చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
2019, ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ అన్న పేరును వైఎస్ఆర్ రైతు భరోసాగా మార్చి, ఆంధ్ర ప్రదేశ్లోని రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చారు. ఈ పథకం కింద పీఎం కిసాన్ యోజన కింద అందించే రూ.6000 తో పాటు వైసిపి ప్రభుత్వం అందిస్తామన్న రూ. 7,500 కలిపి ఏడాదికి మూడువిడతల్లో మొత్తం రూ. 13,500 రైతుల ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మొత్తాన్ని రూ.20,000 పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తయిన తరువాత ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతుల కోసం అమలులోకి తీసుకువచ్చిన మరికొన్ని పథకాలు పేర్లు కూడా మార్చడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసాని అన్నదాత సుఖీభవగా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలను , వడ్డీ లేని రుణాలుగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంట భీమాను ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనగా మార్చడం జరిగింది.
Share your comments