News

అన్న క్యాంటీన్ మెనూ: ఆంధ్ర ప్రదేశ్ అన్న క్యాంటీన్ మెనూ మరియు ఇతర వివరాలు

KJ Staff
KJ Staff

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ చాలా మందికి ఆ అన్నం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఏపీలో ప్రతి పేదవాడి కడుపు నింపేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. అతి తక్కువ ఖర్చుతోనే, రుచికరమైన భోజనాన్ని ప్రతీ పేదవాడికి అందించడం ఈ అన్న క్యాంటీన్ల లక్ష్యం.

ఆగష్టు 15, స్వతంత్ర దినోత్సవం రోజున, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను తెరవనుంది. అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రంలోని పేదలకు రూ.5 కే రుచికరమైన భోజనం అందించనున్నారు. ఈ నెలలో మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. మొదటగా ఆగష్టు 15వ తారీఖున కృష్ణ జిల్లా గుడివాడలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు, మిగిలిన 99 క్యాంటీన్లను ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో మిగిలిన క్యాంటీన్లను ప్రారంభిస్తారు. 

క్యాంటీన్లలో వడ్డించే ఆహార పదార్ధాలు, వాటి తయారీ, సరఫరా తదితర బాధ్యతలన్నీ హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది, వీటిలో 180 ఇప్పటికే సిద్ధమయ్యాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ మొదట 100 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తుంది, మిగిలిన వాటిని ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ 5 లోపు ప్రారంభించనున్నారు.

అన్న క్యాంటీన్ కు సంబంధించిన మెనూ కూడా సిద్దమయ్యింది, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి, వారానికి ఆరు రోజులు క్యాంటీన్లు నడుస్తాయి, అయితే ఆదివారం మాత్రం సెలవు దినం. ఉదయం టిఫిన్ 7.30 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా భోజనం 12.30 PM నుండి 3.00PM వరకు అందుబాటులో ఉంటుంది. మెనూ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More