ఆగస్టు నేలలో ఆంధ్రప్రదేశ్ వ్యాపత్తంగ ఆశించిన స్తాయిలో వర్షపాతం నమోదుకాలేదు , కోన్నిజిల్లాలలో 22 జిల్లాల్లో 54శాతం తక్కువ వర్షపాతం మాత్రమే నమోదు అయ్యింది.
సెప్టెంబరులో కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుందాని వాతవరణ శాఖ అంచనాలను విడుదల చేసింది. దీనితో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడిన
రాయలసీమలో ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే, ఉత్తరకోస్తాలో మాత్రం సాధారణ వర్షపాతం కురువనుందని, వాతవరణ శాఖ ప్రకటించాడం కస్తా ఊరట కలిగించే విషయం.
సెప్టెంబరు తొలి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది తప్ప, రాయలసీమ, దక్షిణ కోస్తాలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని వాతవరణ శాఖ నిపుణులు అంటున్నారు.
రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 10 నుండి 'రైతు బీమా' పథకానికి దరఖాస్తులు ప్రారంభం..
ఆగస్టు నేలలో రాష్ట్రంలోని 26 జిల్లాలకుగాను 22 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంట్లో 12 జిల్లాల్లో లోటు ఎక్కువగా నమోదైంది. ఆగస్టులో రాష్ట్రంలో 144.3 మి.మీ.కుగాను 67 మి.మీ.(54 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అనంతపురంలో 85 శాతం, అంబేడ్కర్ కోనసీమలో 82, ప్రకాశంలో 78, ఎన్టీఆర్ జిల్లాలో 77, సత్యసాయి జిల్లాలో 76, కర్నూలులో 75 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలోని చాల ప్రాంతలలో కరువు పరిస్థితిలు నేలకోన్నాయి.
Share your comments