ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో వైజాగ్ -సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడుస్తుంది . ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు సర్వీస్ ను ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ భావిస్తుంది , ఇప్పటికే దీనికి సంబందించిన ట్రయల్ రన్ లను నిర్వహించి ఏప్రిల్ 8 నుంచి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తుంది .
దేనితో తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది దీనితో తిరుపతి -హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం 3 నుంచి 4 గంటలవరకు తగ్గనుంది , సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌కు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టాప్‌లుగా ఉండే అవకాశం ఉంది.
వందే భారత్ ప్రత్యేకతలు :
కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తేలికైనది మరియు కేవలం 52 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ప్రస్తుతం, అన్ని వందే భారత్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ మరియు ఆటోమేటిక్ డోర్‌లను కలిగి ఉన్నాయి. కుర్చీని 180 డిగ్రీల్లో తిప్పవచ్చు.
జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, సీసీ కెమెరాలు, వాక్యూమ్ టాయిలెట్లు ఉన్నాయి. రైలు కవచం లేనిది, అంటే ముందు నుండి రైలు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
పాన్ ఆధార్ లింకింగ్ కు ఇంకా 3 రోజులే గడువు ..ఇప్పుడే లింక్ చేసుకోండి !
15 ఆగస్టు 2021న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో,స్వతంత్ర అమృత్ మహోత్సవం యొక్క 75 సంవత్సరాలలో , 75 వందేభారత్ రైళ్లు దేశంలోని అన్ని ప్రాంతాలలో నడుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వందే భారత్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొదటి సెమీ-హై స్పీడ్ రైలు.
Share your comments