ప్రపంచం ఇప్పుడిపుడే కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విధ్వంసం ను మరిచి వారి వారి పనులలో నిమగ్నం అయింది , ఇప్పుడిప్పుడు స్వేచ్చగా ఊపిరి పీల్చు కుంటుంది ,ఈక్రమంలో ఆఫ్రికాలోని ఘనా దేశంలో మరో వైరస్ బయటపడడం అందరిని కలవరానికి గురిచేస్తుంది . కరోనా కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ వైరస్ ప్రాణాంతకమైనది .
ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన 'మార్ బర్గ్' వైరస్ కేసులు నమోదవడం ప్రజలను తీవ్ర భయ బ్రాంతులకు గురిచేస్తుంది . ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది. తాజాగా ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్‌ఓ వైరస్ గురించి అధ్యయనానికి కీలక సమావేశం నిర్వహించింది .
ఈ వైరస్ ఎబోలా లాంటి వైరస్ లక్షణాలు కల్గి ఉండడంతో దీని వ్యాప్తి గురించి అధ్యయనం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేసింది . BNOలోని ఒక నివేదిక ప్రకారం, ఎబోలా లాంటి వైరస్ ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ కారణంగా తొమ్మిది మంది మరణించినట్లు సమాచారం దీనితో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలలో లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు .
ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రాణాంతకమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ కు చాలా వేగంగా విస్తరించే లక్షణాలు ఉన్నాయి . అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు. వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగుల పడక, వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
వైరస్ లక్షణాలు :
- తీవ్రంగా జ్వరం
తలనొప్పి
శరీరంలో అంతర్గతంగా, రక్త స్రావం-
ఇంట్లో కప్ప వచ్చిందని కూర వండిన తండ్రి .. తిని చనిపోయిన కూతురు
Share your comments