ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకం డబ్బులను గతంలో చెప్పిన విధంగా విద్యార్థి తల్లుల ఖాతాలో డబ్బులు నేడు అనగా జూన్ 28 బుధవారం రోజున విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి . జూన్ 12న పాఠశాలలు ప్రారంభం అయినా నేపథ్యంలో , 28న తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.గత నాలుగేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యను ప్రోత్సహించేందుకు పిల్లలను చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తోంది.
ఈ పథకం ద్వారా 15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ..2022-23 విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మఒడి ను నేడు విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి . ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
ఎకరం పైన భూమి ఉన్న రైతులకు నేటి నుంచి రైతుబంధు ..!
అనంతరం కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
Share your comments