News

నేడు లక్షల మంది అకౌంట్లలో.. రైతు భరోసాతో పాటు ఆ డబ్బులు కూడా!

KJ Staff
KJ Staff

రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత కింద 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,120 కోట్లు జమ చేస్తారు.

వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఈ నిధుల్ని జమచేస్తోంది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అలాగే రూ. 601.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ మీట నొక్కి ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయిస్తారు.

ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నవంబర్‌ నెలాఖరులో నివర్‌ తుపాను వల్ల కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు అతి స్వల్ప సమయంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నారు. 

Share your comments

Subscribe Magazine

More on News

More