ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేసింది. ఇవాళ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సడలింపుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలు బుధవారంతో ముగియనున్నాయి. దీంతో ఇవాళ అధికారులతో సమావేశమైన జగన్.. లాక్ డౌన్ సడలింపులు మారుస్తూ నిర్ణయించారు.
ప్రస్తుతం 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది. ఇక కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి పైన నమోదవుతున్న ఐదు జిల్లాల్లో ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుతుండటంతో కర్ఫ్యూ నిబంధనల్లో మార్పులు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకే షాపులు మూసేయాల్సి ఉంటుంది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి లోపు తగ్గేవరకు ఈ కర్ప్యూ నిబంధనలు అమల్లో ఉండున్నాయి. ఉభయగోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకుకర్ఫ్యూ నుంచి మినహాయింపు అమల్లో ఉండనుంది.
ఇక ఏపీలో సినిమా హాళ్లు, జిమ్ లు, ఫంక్షన్ హాళ్లు ఓపెన్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా హాళ్లల్లో సీటుకు సీటుకు మధ్య ఖాళీ ఉండాలని, కోవిడ్ నిబంధనలు అన్నీ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక జిమ్ లు, ఫంక్షన్ హాళ్లు యాభై శాతం హాజరుతో నడవాలని సూచించింది.
Share your comments