ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నోకల కోడ్ అమలులో ఉన్నందున, వాలంటీర్లు పెన్షన్ పంపిణి కార్యకలాపాల్లో పాలుపంచుకోరాదని ఎలక్షన్ కమిషన్ ఉతర్వులు జారీచేసింది. దీని కారణంగా పోయిన నెల సచివాలయాలు వద్ద పెన్షన్ పంపిణి చేసారు. అయితే ఈ పద్ధతి ద్వారా తలెత్తిన కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఈ నెల నుండి నేరుగా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జామచెయ్యడానికి సర్వం సిద్ధం చేసారు.
ఆంధ్ర ప్రదేశ్లో గత నాలుగు సంవత్సరాలుగా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణి చేసేవారు. అయితే ఎన్నికల నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత, వాలంటీర్లు ద్వారా పెన్షన్ పంపిణీ సాధ్యపడదని తేల్చిచెపింది, దీనితో ఏప్రిల్ నెలలో గ్రామ మరియు వార్డు సచివాలయాలు వద్ద పెన్షన్ అందించారు. అయితే మే నెలలో ఆధార లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లో నేరుగా జామచెయ్యాలని అధికారులు నిర్ణయించారు. మే నెల పెన్షన్ల పంపిణి చివరి దశకు చేరుకోగా ఇంకా కొంత మందికి పెన్షన్ పంపిణి జరపాల్సిఉంది.
పెన్షన్ తీసుకునేవారిలో ఎక్కువమంది వృద్దులే ఉండగా వారిలో వయసు పైబడి నడవలేని వారు ఉన్నారు, అలాగే ఆధార్ తో బ్యాంకు ఖాతాను లింక్ చెయ్యనివారున్నారు. వీరందరికి ఇళ్లవద్దే పెన్షన్ అందిచేలా ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ ద్వారా లభ్ది చేకూరుతుంది. వివిధ క్యాటగిరీలోని వారందరికీ ఇప్పటికే వారి ఖాతాల్లో డబ్బు జమచేశారు. బ్యాంకుకు ఆధార లింక్ లేనివారు, మరియు ఇతరేతర కారణాలు ఉన్నవారిని గుర్తించి నేటినుంచి వారికి ఇళ్లవద్దే పెన్షన్ అందించనున్నారు. అంతేకాకుండా కొన్ని సాంకేతిక కారణాల వలన బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జామకానివారికి కూడా ఇళ్లవద్దే పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారు. సచివాలయం సిబంది లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పెన్షన్ అందించనున్నారు.
Share your comments