మిచౌన్గ్ తుఫాను వళ్ళ భారీగా నష్టపోయిన పొగాకు రైతులకు ప్రభుత్వం తరపు నుండి ఊరట లభించింది. ఈ తుపాను వళ్ళ తమ పంటలు కోల్పయిన పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 10,000 రూపాయిలు అందచెయ్యాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌన్గ్ తుఫాను రైతులకు భారీ నష్ఠాన్నీ మిగిల్చింది . ఈ తుపాను యొక్క ప్రభావం ముఖ్యంగా తీరా ప్రాంత జిల్లాలు అయిన ఈస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో భారీ పంట నష్టానికి కారణయ్యింది. మొత్తం 75,355 హెక్టార్ల పంటకు గాను 14,730 హెక్టార్ల పంట కోతకు గురి అయ్యింది. ఈ తుఫాను కారణంగ ఎంతో మంది ఫ్ల్యూ క్యూరెడ్ వర్జినియా (FLV ) పొగాకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు.
అధిక వర్ష పాతం, మరియు పొలంలో నీళ్లు నిలిచిపోవడం కారణంగా మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి పొగాకు రైతులకు కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10,000 వడ్డీ రహిత లోన్లను రైతులకు అందచెయ్యాలి అని నిర్ణయయించింది. ఈ లోన్ ద్వారా రైతులు తిరిగి నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయి. వేలం ద్వారా వచ్చే డబ్బు నుండి ఈ లోన్ అమౌంట్ తిరిగి పొందబడుతుంది
కర్ణాటకలో పొగాకుకు మంచి వేలం:
ఆంధ్ర ప్రదేశ్ రైతుల మాదిరిగానే, కర్ణాటక పొగాకు రైతులు కూడా ఈ తుపాను కారణంగా తమ పంటలను కోల్పోయారు. కానీ ఆశక్తి కరంగా కర్నటకలో పొగాకు అధిక ధర పలుకుతుంది. 39,552 FCV పొగాకు రైతులతో, 85.12 మిలియన్ కిలోగ్రాముల పొగగాకు ఈ-ఆక్షన్ ప్లాట్ఫారం ద్వారా అమ్ముడుపోయింది. గత సీజన్లో కిలోకు 228.01 రూ పలికిన పొగాకు ఈ సంవత్సరం ఏకంగా కిలో 256.48 రూ పలికింది. భారత దేశ ప్రభుత్వం పొగాకు ఈ- ఆక్షన్ ప్లాట్ఫారం లో తెచ్చిన ఉపసంహరణలు ఈ మార్పుకు కారణాలు
Share your comments