ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజగా కొత్త నిర్ణయం తీసుకుంది , ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును అనుసందించడానికి మరియు అన్ని ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ప్రత్యేక గెజిట్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈమేరకు సంక్షేమ పథకాలు తీసుకునే ప్రతిఒక్కరు తమ ఆధార్ కార్డును అనుసంధానించుకోవాలి.
పథకాల అమలులో పారదర్శకత మరియు అనర్హులను గుర్తించడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది. ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్ కచ్చితంగా అనుసంధానం చేయవల్సిన నిబంధలనులను చేర్చింది .
MFOI అవార్డు లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల !
ఆధార్ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. ఆధార్ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలి' అని ప్రభుత్వం పేర్కొంది.
Share your comments