అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను జమ చేసింది . ఈ పంట సీజన్ కు సంబందించి 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసినట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .
అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈమేరకు పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవడానికి నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమచేసింది. నిల్వ ధాన్యాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశించింది .
ఇది కూడా చదవండి .
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం .. సీఎం కెసిఆర్ హామీ !
ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
Share your comments