News

AP New Districts:కొత్త జిల్లాల వివరాలు.. అతి చిన్న జిల్లా ఏది ?

S Vinay
S Vinay

AP New Districts:కొత్త జిల్లాల వివరాలు

తెలంగాణ ఆవిర్భవానికి ముందు  ఉమ్మడి రాష్ట్రంలో  మొత్తం 23 జిల్లాలు ఉండేవి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలుగా మారాయి. ఇప్పుడు సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం తో అవి మొత్తం 26 జిల్లాలుగా మారాయి.ప్రతి  నియోజకవర్గాన్ని సులభంగా  పరిపాలించడానికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వెనుక ఉన్న కారణం .

 ఏర్పాటైన కొత్త జిల్లాలో(AP New Districts)  ఈరోజు నుండే పరిపాలన మొదలవనుంది.ఏర్పాటైన కొత్త జిల్లాలు (new districts)  చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు,విశాఖపట్నం,అనకాపల్లి ,కాకినాడ ,కోనసీమ ,తూర్పుగోదావరి ,పశ్చిమగోదావరి ,ఏలూరు ,కృష్ణా,ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ ,పొట్టి శ్రీరాములు,కర్నూలు, నంద్యాల ,అనంతపురం, శ్రీ సత్యసాయి,వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు ,మరియు తిరుపతి గా ఏర్పాటు అయ్యాయి.

 

(AP New Districts)జిల్లాల విభజన తర్వాత భౌగోళిక  విస్తీర్ణ పరంగా చూసుకుంటే  ప్రకాశం 14,322 చదరపు కిలోమీటర్లతో పెద్ద జిల్లాగా  అవతరించగా    అత్యంత చిన్నదిగా పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది.జనాభా పరంగా చూస్తే  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 24లక్షల 70వేల జనాభాతో  అతి పెద్ద జిల్లాగా ఉంది.

 జిల్లాలలోని పరిపాలన భవనాల ఎంపిక   కూడా జరిగిపోయింది. పరిపాలన  ప్రాంగణమం 15 ఎకరాల స్థలం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని  Ap Cm వైస్ జగన్ మోహన్ రెడ్డి  ఆయా జిల్లా అధికారులకు సూచించారు. అద్దె  భవనాలు కాకుండా సొంత భవనాల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి

PM KISAN Scheme UPDATE : అనర్హులైన రైతుల నుంచి తిరిగి డబ్బులు వసూల్ !

Share your comments

Subscribe Magazine

More on News

More