News

ప్రభుత్వం : ప్రతి పాఠశాల విద్యార్థి భోజనంలో గుడ్డు, చిక్కీని చేర్చనుంది..

Srikanth B
Srikanth B

పోషకార సమస్య అనేది చిన్న పిల్లలలో అధికం గ కనిపించే సమస్య దీన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు చేసే కృషి లో భాగమే మధ్యన భోజన పథకం , దూర ప్రాంతాలనుంచి బడులకు వచ్చే విద్యార్థులు ఆహారాన్ని అందించడం తో పాటు పోషకాహార లోపాన్ని కూడా అధిగమించేందుగు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది .

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు ఐదు రోజులకోసారి గుడ్లు, మూడు రోజులకోసారి చిక్కీలు అందించాలని ప్రభుత్వం డీఈఓలను గతంలోనే ఆదేశించింది.

పాఠశాల విద్యార్థుల పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్న భోజనంతో సంబంధం లేకుండా పాఠశాలల్లో విద్యార్థులందరికీ గుడ్డు, శనగ బెల్లం చిక్కీని సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, చిక్కీలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాలని మధ్యాహ్న భోజన, పాఠశాల శానిటేషన్ డైరెక్టర్ బీఎం దివాన్ మైదీన్ డీఈవోలందరినీ ఆదేశించారు.

IBPS రిక్రూట్‌మెంట్ 2022; 6000కు పైగా ఖాళీలు భర్తీ!

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు ఐదు రోజులకోసారి గుడ్లు, మూడు రోజులకోసారి చిక్కీలు అందించాలని డీఈఓలను గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు, ప్రభుత్వం విద్యార్థులందరికీ వారి పోషకాహారాన్ని పెంచడానికి దీనిని విస్తరించింది.

రైతుబంధు డబ్బులు అకౌంట్‌లో పడ్డాయా? లేదా?.. క్షణాల్లో తెలుసుకోవడం ఎలా?

Share your comments

Subscribe Magazine

More on News

More