News

AP hikes land rates :భారీగా పెరిగిన కొత్త జిల్లాల భూముల రేట్లు !

Srikanth B
Srikanth B

కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను సవరిస్తూ ( AP hikes land rates)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం ఏప్రిల్ 6 నుంచి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూముల విలువను సవరించనున్నారు.

 AP hikes land rates:గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువను సవరించడానికి కమిషనర్-స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది మరియు భూమి విలువను సవరించడం వల్ల ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా గణనీయంగా పెరుగుతాయి.

తెలంగాణ ఆవిర్భవానికి ముందు  ఉమ్మడి రాష్ట్రంలో  మొత్తం 23 జిల్లాలు ఉండేవి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలుగా  (AP hikes land rates) మారాయి. ఇప్పుడు సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం తో అవి మొత్తం 26 జిల్లాలుగా మారాయి.ప్రతి  నియోజకవర్గాన్ని సులభంగా  పరిపాలించడానికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వెనుక ఉన్న కారణం .

 

 ఏర్పాటైన కొత్త జిల్లాలో(AP New Districts)  ఈరోజు నుండే పరిపాలన మొదలవనుంది.ఏర్పాటైన కొత్త జిల్లాలు (new districts)  చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు,విశాఖపట్నం,అనకాపల్లి ,కాకినాడ ,కోనసీమ ,తూర్పుగోదావరి ,పశ్చిమగోదావరి ,ఏలూరు ,కృష్ణా,ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ ,పొట్టి శ్రీరాములు,కర్నూలు, నంద్యాల ,అనంతపురం, శ్రీ సత్యసాయి,వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు ,మరియు తిరుపతి గా ఏర్పాటు అయ్యాయి.

AP New Districts:కొత్త జిల్లాల వివరాలు.. అతి చిన్న జిల్లా ఏది ? (krishijagran.com)

 

Share your comments

Subscribe Magazine

More on News

More