News

నేటి నుండి ఆంధ్ర ప్రదేశ్లో పింఛన్ల పంపకం షురూ.....

KJ Staff
KJ Staff


ఆంధ్ర ప్రదేశ్ లో పింఛన్ల పంపకం నేటి నుండి ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణి నిలిపివెయ్యాలని ఎన్నికల సంగం మార్గదర్శకాలను జారీచేసింది. గడచినా నాలుగున్నర ఏళ్లలో పింఛన్ దారులకు ఇళ్ల వద్దే వాలంటీర్లు పింఛన్లు అందించేవారు. ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగా, నేటి నుండి లభిధారులకు గ్రామా వార్డు సచివాలయాల్లో పింఛన్ అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం 65,69,904 పింఛన్ లబ్దిదారులున్నారు. అందరికి పింఛన్ అందించడానికి గ్రామా వార్డు సచివాలయాల పరిధిలోని బ్యాంకుల్లో మంగళవారం రాత్రి డబ్బు జమ చేసారు. రూ. 1,915.69 కోట్ల మొత్తని బ్యాంకులలో జమచేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో, సచివాలయాల వద్దే పింఛన్ అందించనున్నట్లు, అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసారు.

ఎండలు ముదురుతున్న కారణంగా, సచివాలయాల వద్ద పింఛనుదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టెంట్లు, నీటి సదుపాయం ఏర్పాటు చెయ్యాలని గ్రామా పంచాయితీలకు తెలిపారు. పింఛన్లు ప్రశాంతంగా ముగిసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఒక సచివాలయం పరిధిలో అనేక గ్రామాలూ ఉనందున, అటువంటి సచివాలయాల్లో అదనపు సిబందిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసారు.

సచివాలయాలు సిబంధి అందరికి పింఛన్ల పంపిణీకి సంబంధించిన లాగిన్ వివరాలు అన్ని అందుబాటులో ఉంటాయి. ప్రతీ సచివాలయం వద్ద అదనపు ఫింగర్ ప్రింట్ స్కానర్లు అందుబాటులో ఉంటాయి. లభిధారులు, తమ ఆధార కార్డు, లేదా ఐరిస్ ముఖ్య గుర్తింపు విధానంలో పింఛన్ పొందవచ్చు. ఆధార్ కార్డు వెరిఫికేషన్ లో ఇబ్బందులు తలెట్టినట్లైతే, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ సెక్రెట్రీలను సంప్రదిచవలసి ఉంటుంది. సచివాలయం సిబంధి బ్యాంకుల నుండి డబ్బు తీసుకువచ్చాక, మధ్యాహ్నం నుండి పింఛన్ పంపిణి ప్రారంభం అవుతుంది. పింఛన్ పంపిణి సమయంలో ఎటువంటి ప్రచారాలు కానీ, ఫ్లెక్సీలు కానీ ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ సూచించింది.

Share your comments

Subscribe Magazine

More on News

More