గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన విషయం తలిసింది.. దీనికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇప్పటికి 30-40 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది . రైతులు వర్షాలకు ఎదురుచూస్తున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది . రానున్న రెండు రోజులలో రాష్టంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో 35 నుంచి 36 శాతం లోటు నమోదయ్యింది . ఈ నెలలోనైనా వర్షపాతం ఆశించిన మేరకు కురుస్తుందో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావం దక్షిణాదిపై లేకపోయినా ఉత్తరాదిన మాత్రం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, డిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణాదిన మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తక్కువ ధరకు నిత్యావసరల పంపిణీకి కసరత్తు ...
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
Share your comments