News

హైకోర్టులలో 37 మంది న్యాయమూర్తుల నియామకం ...

Srikanth B
Srikanth B

వివిధ హైకోర్టులకు 37 మంది న్యాయమూర్తులను నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం వివిధ హైకోర్టులకు 26 మంది న్యాయమూర్తులను నియమిస్తూ జారీ అయిన ఉత్తర్వులకు కొనసాగింపుగా ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది అంటే 2022లో పంజాబ్ హర్యానా హైకోర్టులో మరో 11 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తూ జారీ అయిన నోటిఫికేషన్‌తో దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఇప్పటివరకు 138 నియామకాలు జరిగాయి, దీంతో ఒక ఏడాదిలో రికార్డు స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగింది. 2016 లో జరిగిన 126 మంది హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం ఇంతవరకు రికార్డు గా ఉంది. ఈ ఏడాది జరిగిన నియామకాలు ఈ రికార్డును అధిగమించాయి. గత ఏడాది అంటే 2021లో సుప్రీంకోర్టులో 9 మంది, హైకోర్టుల్లో 120 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. దీనితో ఉన్నత న్యాయవ్యవస్థలో మొత్తం నియామక ప్రక్రియ ఫాస్ట్ను ట్రాక్ విధానంలో వేగవంతం అయ్యింది.


పంజాబ్ హర్యానా హైకోర్టు లో న్యాయమూర్తులుగా నిన్న న్యాయవాదులు (1) శ్రీమతి నిధి గుప్తా, ఎస్/శ్రీ (2) సంజయ్ వసిష్త్, (3) త్రిభువన్ దహియా, (4) నమిత్ కుమార్, (5) హరికేష్ మనుజ, ( 6) అమన్ చౌదరి, (7) నరేష్ సింగ్, (8) హర్ష్ బంగర్, (9) జగ్మోహన్ బన్సల్, (10) దీపక్ మంచాందా మరియు (11) అలోక్ జైన్ నిన్న అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు వారు పదవిలో కొనసాగుతారు.

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..

Share your comments

Subscribe Magazine

More on News

More