AP 10th Class Exams 2022: పదో తరగతి విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు!AP SSC Exams 2022: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త . పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపించి.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.
AP 10th Class Exams 2022: పదో తరగతి విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు!
AP 10th Class Exams 2022: పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బంపరాఫర్ ఇచ్చింది. ఈనెల 27 నుంచి మే 9 వరకు టెన్త్ పరీక్షలు (10th Class Exams 2022) జరగనున్న వేళా . ఈ నేపథ్యంలో విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధం గ RTC విద్యార్థులకు ఈ సదుపాయాలను కల్పిస్తుంది . పరీక్ష అయిపోయాక ఇంటికి కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఇది కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు మాత్రమే వర్తించనుంది .
పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనుండగా.. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి (free travel) అనుమతించాలని ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చారు. పాస్ లేకపోయినా హాల్‌టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని అందులో వారు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 6.22లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
Share your comments