మనం నిత్యం ఎదో ఒక వస్తువు కొనడానికి దుకాణానికో లేదా మాల్స్ కు వెళ్తుంటాం. సాదారణముగా విధి దుకాణంలో లేదా రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు మనం ఏదైనా వస్తువు తీసుకున్న మనకు ప్లాస్టిక్ కవర్ ఉచితముగానే అందిస్తుంటారు కానీ మాల్స్,సూపర్ మార్కెట్ విషయానికి వచిన్నపుడు కథ వేరేలాగ ఉంటుంది . మనం తీసుకున్న వస్తువులకు తోడు వస్తువులను పెట్టుకోవడానికి ఇచ్చే ప్లాస్టిక్ కవర్లకు కూడా డబ్బులు ఛార్జ్ చేస్తుంటారు . దానిని మనము పట్టించుకొము , కానీ చట్ట ప్రకారం ఏదైనా మాల్స్ లో అందించే ప్లాస్టిక్ కవర్లకు మనం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు .
2019 మే నెలలో ఆకాష్ కుమార్ నుంచి హైదర్‌నగర్‌లోని డి'మార్ట్ క్యారీ బ్యాగ్‌కు రూ. 3.50 వసూలు చేసిందని దానిపై దాహాలైన పిటిషను విచారించిన హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (సిడిఆర్‌సి) ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. క్యారీ బ్యాగ్ సరఫరా కోసం ఎటువంటి చెల్లింపు అవసరం లేదు.
బ్యాగ్‌లో డి'మార్ట్ లోగో ఉన్నందున, రిటైల్ కంపెనీ క్యారీ బ్యాగ్‌కు ఛార్జీ విధించడం సరికాదని పిటిషనర్ వాదించారు. ఆర్డర్‌ను అందజేసేటప్పుడు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగదారులకు ఉచితంగా అందించాలని నిర్దేశించిన ప్లాస్టిక్ నిర్వహణ నిబంధనలకు 2018లో చేసిన సవరణను కమిషన్ ప్రస్తావించింది.
ఆధార్ కార్డు నెంబర్ తో బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా !
కమీషన్‌కు రూ.1,000 చెల్లించడంతో పాటు వినియోగదారునికి రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని మరియు అతని నుండి వసూలు చేసిన రూ.3.5 తిరిగి ఇవ్వాలని కమిషన్ డి'మార్ట్‌ను కోరింది. ఆర్డర్‌ను పాటించేందుకు డి'మార్ట్‌కు 45 రోజుల సమయం ఇవ్వగా, రిటైలర్ అలా చేయడంలో విఫలమైతే 18 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది.కావున మీరు తదుపరి ఏదైనా మాల్స్ లో వస్తువులు కొన్నపుడు ఈ విషయాలని గుర్తించుకోండి .
Share your comments