News

2 నిమిషాల్లో మట్టి పరీక్ష: మొబైల్ మట్టి స్కానర్ లను రూపొందించిన అరీస్ ఆగ్రోస్ ltd

Sriya Patnala
Sriya Patnala
Aries agros launched a AI based mobile soil scanner-gives results in 2 min
Aries agros launched a AI based mobile soil scanner-gives results in 2 min

అరీస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థ , దేశం లోనే మొదటి రకమైన తమ మొబైల్ మట్టి స్కానర్ లను, మంగళవారం విడుదల చేసారు.

దేశం లో ప్రముఖ స్పెషలిటీ ప్లాంట్ న్యూట్రిషన్ సంస్థ అయినా అరీస్ ఆగ్రో లిమిటెడ్ మంగళవారం జరిగిన తమ చైర్మన్ క్లబ్ వార్షిక వ్యాపార సదస్సు కార్యక్రమంలో , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే సాయిల్ స్కానర్ - “భూపరీక్షక్ "ను లాంచ్ చేసారు. 250 గ్రాముల బరువు, 6 అంగుళాల పొడవు ఉండే పోర్టబుల్‌ మెషీన్‌ ఎటువంటి రసాయనాలు అవసరం లేకుండా మట్టిని పరీక్ష చేసి ఫలితాన్ని రెండు నిమిషాల్లో ఇస్తుంది.

దీనితో పాటు ఆర్గాబూస్ట్, కాల్‌మాక్స్ & మజోర్సోల్ చిల్లీ & మజోర్సోల్ మిల్లెట్స్ మొదలైన కొత్త ఉత్పత్తుల ను కూడా ప్రారంభించారు.

వ్యవసాయ రంగం లో ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు టిస్కోచే అరీస్ సంస్థ, మట్టి పరీక్షను సులభతరం చేయడానికి ఈ పరికరాన్ని టిస్కోచింది. ఈ సందర్భంగా ఏరీస్‌ ఆగ్రో లిమిటెడ్‌ చైర్మన్‌, ఎండి డా.రాహుల్‌ మిర్చందానీ మాట్లాడుతూ ఏరీస్‌ ఆగ్రో ఈ ప్రత్యేకమైన మట్టి స్కానింగ్‌ పరికరం ఉత్పత్తి కోసం ఐఐటి-కె బిజిసెన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో ఒక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ఈ ఉత్పత్తులు సహాయం చేస్తాయన్నారు. 250 గ్రాముల బరువున్న 6 అంగుళాల పోర్టబుల్‌ మెషీన్‌ ఎటువంటి రసాయనాలు అవసరం లేకుండా పరీక్షలు చేసి ఫలితాన్ని రెండు నిమిషాల్లో ఇస్తుంది.

ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఏరీస్ టాప్ డీలర్లు కూడా పాల్గొన్నారు. APకి చెందిన డిస్ట్రిబ్యూటర్ పి . శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, "ఏరీస్ ఆగ్రో రైతులకు వినూత్నమైన మరియు సరసమైన పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తుంది . వారి 130+ ఉత్పత్తులు మరియు సేవల విస్తృత శ్రేణి ద్వారా రైతుల ఖర్చులు అలాగే పర్యావరణ నష్టాన్ని తగ్గించడంతోపాటు, రైతులకు దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది." అని తెలిపారు.

Share your comments

Subscribe Magazine