తెలంగాణాలో యాసంగి వడ్ల కోతలు మొదలయ్యాయి ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే ఈ కోతలు మే మొదటి వరం వరకు కొనసాగుతాయి అయితే ముందుగా నాట్లు వేసిన రైతులు ఇప్పటికే కోతలు కూడా ప్రారంభించారు మరి ముఖ్యం గ నల్లగొండ , మిర్యాలగూడలో ఇప్పటికే కోతలు ప్రారంభమై వరం దాటింది దీనితో అక్కడి అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు .
ఇప్పటికే నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్లో లోని వరి ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు నల్గొండ కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో పౌర సరఫరాలు, మిల్లర్లు, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ, మార్కె టింగ్, రవాణా శాఖల అధికారులతో యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
నల్లగొండ వ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యనుండగా అందులో పీఏసీఎస్ ద్వారా 140, ఐకేపీ ద్వారా 138 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు దీని ద్వారా మొత్తం వడ్లను సేకరించనుండలు అధికారులు తెలిపారు .
బ్యాంకుకు వెళ్లకుండా పంటలపై రుణం ..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 2 వారం లేదా 3 వ వారం వరకు కొనుగోళ్లు మొదలు కానున్నాయి , రైతులకు ఇబ్బంది ఏర్పడకుండా ఇప్పటికే గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు .
Share your comments