మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వాక్యాలు చేశారు. వచ్చేనెల పదో తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఆ తేదీ తర్వాత నోటిఫికేషన్ వస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికలతో పాటు మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి అని ఆయన అన్నారు.
మంత్రి కేటీఆర్ ఈ విషయంపై స్పష్టత అనేది పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ వస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర భయాందోళనలో ఉన్నారని మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందనుకుంటున్నారని అందుకే జమిలీ ఎన్నికల పేరుతో ఆలస్యం చేయాలనుకుంటున్నారని కేటీార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో, రాబోయే జమిలి ఎన్నికల చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం చురుకైన చర్యలు చేపట్టింది. సమగ్ర విశ్లేషణ మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మార్గదర్శకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ముందస్తు ఎన్నికలు జరగబోవని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు జరగకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేలా రాజ్యాంగ సవరణ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు పెడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇది కూడా చదవండి..
ఏపీ పెన్షనర్లకు శుభవార్త.. గడువును పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం..
జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడుతుందా లేదా అన్నది సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ, దానిని ముందుకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయని చాలా మంది వ్యక్తులలో నమ్మకం పెరుగుతోంది. ఏ సమయంలోనైనా కోవింద్ కమిటీ తమ నివేదికను విడుదల చేయవచ్చని ఈ వ్యక్తులు వాదిస్తున్నారు.
జమిలి ఎన్నికలు జరగాలంటే గతంలో పార్లమెంట్‌లో కేంద్రం చెప్పినట్లుగా ఐదు నిర్దిష్ట రాజ్యాంగ సవరణలు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి, రాబోయే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను కేంద్రం వెల్లడించలేదు, అయితే మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..
Share your comments