News

AZADI KA AMRIT MAHOTSAV:'కిసాన్ భాగిదారి ప్రాథమికత హమారీ' పాల్గొననున్న కోటికిపైగా రైతులు!

S Vinay
S Vinay

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 2022 ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 30 వరకు ‘కిసాన్ భాగిదారి' ని నిర్వహించనున్నారు.

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' 'Azadi Ka Amrit Mahotsav' కింద 2022 ఏప్రిల్ 25 నుండి 30 వరకు 'కిసాన్ భాగిదారీ, ప్రాథమికత హమారీ' ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రచారం సందర్భంగా, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ రైతుల కోసం ప్రాంతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి మేళాను, సహజ వ్యవసాయంపై క్షేత్ర ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఉమ్మడి సేవా కేంద్రం (సిఎస్సి) నిర్వహించే పంటల బీమాపై దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభించనున్నారు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద వ్యవసాయ పర్యావరణ, పశువుల పద్ధతులపై అవగాహనా కార్యక్రమం ఉంటుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి (one nation one product )పై వెబ్‌నార్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన 75 మంది రైతులు, పారిశ్రామికవేత్తలతో జాతీయ ఆత్మ నిర్భర్ భారత్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సదస్సు లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఆధారిత వర్క్‌షాప్, వెబ్‌నార్ మరియు వివిధ శాఖల పథకాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

దేశవ్యాప్తంగా ప్రత్యక్ష (ఆఫ్‌లైన్), వర్చువల్ (ఆన్‌లైన్) మాధ్యమం ద్వారా 1 కోటి కంటే ఎక్కువ మంది రైతులు ఈ ప్రచారంలో పాల్గొంటారని అంచనా.

భారత స్వాతంత్రం పొందిన 75 సంవత్సరాలలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన మైలురాళ్ళును ఈ ప్రచారంలో ప్రస్తావించనున్నారు.

మరిన్ని చదవండి.

HARDHENU COW:పాడి రైతులకి పసిడి ఆవు రోజుకి 60 లీటర్ల పాలు....

Share your comments

Subscribe Magazine

More on News

More