News

గ‌త నాలుగు నెల‌ల్లో 79 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు బాల్ ఆధార్ జారీ ..

Srikanth B
Srikanth B

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నాలుగు నెల‌ల్లో (ఏప్రిల్‌- జులై) 0-5 ఏళ్ళ‌లోపు 79 ల‌క్ష‌ల‌మంది పిల్ల‌ల‌ను యునీక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ (ప్ర‌త్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ‌) న‌మోదు చేసింది.
ఇది బాల్ ఆధార్ చొర‌వ కింద 0-5 ఏళ్ళ మ‌ధ్య ఉన్న మ‌రింత పిల్ల‌ల‌ను చేరుకుని, త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు బ‌హుళ ప్ర‌యోజ‌నాల‌ను పొందడంలో తోడ్ప‌డే నూత‌న ప్ర‌య‌త్నంలో భాగం. మార్చి 31, 2022 చివ‌రి నాటికి 0-5 ఏళ్ళ‌లోపు 2,64 కోట్ల మంది పిల్ల‌లు బాల్ ఆధార్‌ను క‌లిగి ఉండ‌గా, జులై 2022 చివ‌రికి ఆ సంఖ్య 3.43 కోట్ల‌కు పెరిగింది.

దేశ వ్యాప్తంగా, శ‌ర‌వేగంతో బాల్ ఆధార్ న‌మోదు ప్ర‌క్రియ పురోగ‌మిస్తోంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్, హ‌ర్యానా వంటి రాష్ట్రాల‌లో 0-5 లోపు వ‌య‌సుగ‌ల పిల్ల న‌మోదు ఇప్ప‌టికే ల‌క్ష్యిత వ‌యోవ‌ర్గంలో 70%కి పైగా క‌వ‌ర్ చేసింది. జ‌మ్ము & కాశ్మీర్‌, మిజోరాం, ఢిల్లీ, ఆంధ్ర ప్ర‌దేశ్‌, ల‌క్ష‌ద్వీప్ స‌హా ప‌లు ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో పిల్ల‌ల (0-5 వ‌యోవ‌ర్గం) న‌మోదు అద్భుతంగా కొన‌సాగుతోంది.
మొత్తం మీద‌, ప్ర‌స్తుతం ఆధార్ సంతృప్త‌త స్థాయి దాదాపు 94%గా ఉంది. ఇక వ‌యోజ‌నుల‌లో ఆధార్ శాచ్యురేష‌న్ స్థాయి దాదాపు 100% గా ఉంది. ఆధార్ ప్ర‌స్తుతం జీవ‌న సౌల‌భ్యం, వ్యాపార సుల‌భ‌త‌ల‌కు ఉత్రేర‌కంగా ఉంది.


యుఐడిఎఐ, దాని ప్రాంతీయ కార్యాల‌యాలు త‌మ పిల్ల‌ల‌ను బాల్ ఆధార్ చొర‌వ కింద న‌మోదు చేసుకునేందుకు ముందుకు రావ‌ల‌సిందిగా నిరంత‌రం ప్రోత్స‌హిస్తున్నాయి. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను వినియోగించుకునేందుకు బాల్ ఆధార్ సౌల‌భ్య‌త క‌ల్పించ‌డ‌మే కాక‌, పిల్ల‌లు పుట్టినప్ప‌టి నుంచీ డిజిట‌ల్ ఫోటో గుర్తింపుగా ప‌ని చేస్తుంది.

బాల్ ఆధార్‌ను 0-5 ఏళ్ళ పిల్ల‌ల‌కు జారీ చేస్తారు. ఆధార్ జారీ చేసేందుకు బ‌యోమెట్రిక్ (వేలిముద్ర‌లు, ఐరిస్) సేక‌ర‌ణ అనేది కీల‌క‌మైన ల‌క్ష‌ణం, ఎందుకంటే, ఈ బ‌యోమెట్రిక్‌ల డి- డూప్లికేష‌న్ ఆధారంగా ప్ర‌త్యేక‌త‌ను నెల‌కొల్ప‌డానికి ఇది అవ‌స‌రం. కాగా, 0-5 వ‌య‌సు గ‌ల పిల్ల‌ల ఆధార్ న‌మోదుకు, ఈ బ‌యోమెట్రిక్‌ల‌ను సేక‌రించ‌రు.

బాల్ ఆధార్ న‌మోదుకు 0-5 ఏళ్ళ వ‌య‌సు మ‌ధ్య ఉన్న పిల్ల‌ల ముఖ చిత్రం, త‌ల్లిదండ్రులు/ సంర‌క్ష‌కుల బ‌యోమెట్రిక్ ప్ర‌మాణీక‌ర‌ణ (చెల్లుబాటు అయ్యే ఆధార్ క‌లిగి ఉండ‌టం) ఆధారంగా నిర్వ‌హిస్తారు. బాల్ ఆధార్ న‌మోదు స‌మ‌యంలో రిలేష‌న్‌షిప్ డాక్యుమెట్ (బాంధ‌వ్య‌ ప‌త్రం) రుజువు, (ముఖ్యంగా జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం)ను సేక‌రిస్తారు.

సాధార‌ణ ఆధార్ నుంచి బాల్ ఆధార్ భిన్న‌మైన‌ద‌ని తెలిసేందుకు, దానిని అది ఆ బాలుడు/ బాలిక‌కు 5 ఏళ్ళు వ‌చ్చే వ‌ర‌కే చెల్లుతుంద‌నే ముద్ర‌తో నీలం రంగులో జారీ చేస్తారు. పిల్ల‌ల‌కు 5 ఏళ్ళు వ‌చ్చిన త‌ర్వాత‌, త‌ప్ప‌నిస‌రి బ‌యోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబియు) అనే ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌డానికి, ఆ బాలుడు లేదా బాలిక త‌న బ‌యోమెట్రిక్ ల‌ను ఆధార్ సేవా కేంద్రంలో న‌మోదు చేసుకోవాలి.

ఆధార్ కార్డ్‌లో పెళ్లి తర్వాత మీ ఇంటిపేరును ఎలా మార్చుకోవాలి?

Share your comments

Subscribe Magazine

More on News

More