బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తరువాత రెండొవ అతిపెద్ద ఉత్పత్తిదారుగ వున్నా భారతదేశం పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేదిస్తున్నట్లు ప్రకటించడంతో వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకసారిగా ఆయా దేశాలలో బియ్యం కొనుగోలుకు ఎగబడ్డారు దీనితో పెద్ద పెద్ద క్యూ లలో నిలబడిన ఎన్నారైలు అవస్థలు పడుతున్నారు.
బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో దీని యొక్క ప్రభావం అమెరికా, కెనడా వంటి దేశాల్లో అధికంగా వుంది ఆయా దేశాల్లో వున్నా భారతీయులు రైస్ ధరలు పెరుగుతాయోనని అనుమానంతో కొందరు కొన్ని నెలలకు సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేశారు. దీన్ని అదునుగా చేసుకున్న అక్కడి సూపర్ మార్కెట్లు బియ్యం ధరలను అమాంతం పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం అనగా 10 కిలోల బియ్యం ధర 18 డాలర్లుగా విక్రయిస్తున్నారు . కొన్ని చోట్ల బియ్యం స్టాక్ అయిపోయిన దృషయాలు కూడా కనిపిస్తున్నాయి.
వృద్దాప్య పింఛన్ మరో రూ.1,000 పెంపు?
విదేశాల్లో నివసించే భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఆహారంగా బియ్యాన్ని తింటారు. బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం విధించిందని తెలియగానే విదేశాల్లో ఉన్న భారతీయులు రైస్ కోసం పోటీపడ్డారు. దీనితో విదేశాలలో భారతీయులు బియ్యం కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న దృషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి . కొందరు అయితే రేషన్ కార్డు ఉంటే బియ్యం తీసుకోవచ్చు బియ్యం కొనడానికి అమెరికా వేళ్ళ అని కామెంట్లు చేస్తున్నారు.
Share your comments