News

BANK HOLIDAYS IN APRIL: ఏప్రిల్ లో బ్యాంకులకు భారీగా సెలవులు పూర్తి వివరాలు తెలుసుకోండి.

S Vinay
S Vinay

ఈ నెలలో బ్యాంకులకు వివిధ కారణాల వలన విపరీతమైన సెలవులు ఉన్నాయి.ఆర్థిక సంవత్సవం ముగంపు ఒక కారణం అయితే పండుగలు మరొక కారణం. అయితే బ్యాంకుల సెలవు దినాలకి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోండి.

ప్రతి నెలా బ్యాంక్ సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది.కొన్ని సందర్భాల్లో రాష్ట్రాన్ని బట్టి సెలవులు నిర్ణయించబడుతాయి
సెంట్రల్ బ్యాంక్ సెలవుల జాబితా మూడు వర్గాలుగా విభజించబడింది: రాష్ట్రవ్యాప్త వేడుకలు, మతపరమైన సెలవులు మరియు పండుగ వేడుకలు.బ్యాంకులకు సాధారణంగా ప్రతి నెల ఆదివారంతో పాటు రెండవ మరియు నాలుగవ శని వారాల్లో సెలవు ఉన్న విషయం తెలిసినదే. అయితే వీటికి అదనంగా మరిన్ని సెలవులు ఈ ఏప్రిల్ నెలలో ఉన్నాయి.

ఏప్రిల్‌ ఒకటిన ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి రోజు కావ‌డంతో బ్యాంకులు ప‌ని చేయ‌వు. ఏప్రిల్ 2వ తేదీన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగ సందర్బంగా సెలవు ఉండి. ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం.

ఏప్రిల్ 9వ తేదీన రెండో శ‌నివారం, 10వ తేదీ ఆదివారం అవ్వడం వల్ల బ్యాంకులు ప‌ని చేయ‌వు.

ఏప్రిల్ 14వ తేదీన భార‌త రాజ్యాంగ సృష్టికర్త అయినా బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతిసందర్బంగా సెలవు

ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే తో పాటు అస్సాం యొక్క బిహు మరియు పశ్చిమ బెంగాల్‌కు బెంగాలీ నూతన సంవత్సరంతో సహా అనేక పండుగలు ఉన్నాయి.

17వ తేదీన సాధారణంగా ఆదివారం కావడం తో సెల‌వు ఉంది.

చివరగా ఏప్రిల్ 23 మరియు 24వ తేదీ నాలుగవ శని , ఆదివారం కావడంతో బ్యాంకులకు సెల‌వు దినాలు ఉన్నాయి. ఈ సెలవు దినాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులన్నింటికీ వర్తిస్తాయి.

కాబట్టి ఈ సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని మీ బ్యాంకు పనుల కొరకై ప్రణాళిక చేసుకోండి.

మరిన్ని చదవండి.

YSR RYTHU BHAROSA:AP రైతులకి శుభవార్త వైస్సార్ రైతు భరోసా కింద త్వరలోనే మొదటి విడత

TELANGANA:పొలానికి దిష్టి ఇలా కూడా తీస్తారా ఈ రైతు ఏం చేసాడో చూడండి.

Share your comments

Subscribe Magazine

More on News

More