ఆర్థిక వ్యవహారాల విషయంలో బ్యాంకులు అనేవి ప్రతిఒక్కరికీ అవసరం. పేదవాడి నుంచి బడా వ్యాపారావేత్త వరకు ప్రతిఒక్కరికీ బ్యాంకుల అవసరం ఉంటుంది. బ్యాంకుల అవసరం లేనివారంటూ ఎవరూ ఉండరు. డబ్బులు దాచుకోవడానికి, అవసరమైనప్పుడు లోన్లు తీసుకోవడానికి, ఇతరులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి.. ఇలా ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంకులు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రస్తుతం చాలా బ్యాంకులు ఉన్నా.. ఇంకా కొత్త బ్యాంకులు ఇండియాలో పుట్టుకొస్తూనే ఉన్నాయి.
అన్ని రంగాల్లో పనిచేసేవారికి బ్యాంకుల అవసరం ఉంటుంది. పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న పనులు చేసేవారి వరకు బ్యాంకు లావాదేవీలు చేస్తూ ఉంటారు. ఇక సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. బ్యాంకుల అవసరం ఉంటుంది. ఇక రైతులకు బ్యాంకులతో ఎప్పుడూ అవసరం ఉంటుంది.
డబ్బు అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. అందుకని ఒక్కరోజూ బ్యాంకు లేకపోయినా ఖాతాదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్ అయినా ఎలా?.. ఖాతాదారులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే ముందు ఈ విషయం తెలుసుకుని అవసరమైన డబ్బులను ముందే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచింది.
ఏప్రిల్‌లో 12 రోజులు బ్యాంకులు బంద్
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో 12 రోజులు బ్యాంకు ఉండవు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలగనుంది.
ఏ ఏ రోజులు బ్యాంకులు ఉండవు.. ఎందుకని?
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో.. ఏప్రిల్ 1న ఖాతాల క్లోజింగ్ ఉంటుంది. ఆ రోజు బ్యాంకులు ఓపెన్ చేసినా.. ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇక ఏప్రిల్ 2న గుడ్‌ప్రైడ్ బ్యాంకులకు సెలవు. ఇక ఏప్రిల్ 4న ఆదివారం బ్యాంకులు ఎలాగూ ఉండవు. ఇక ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రాయ్ జయంతి, ఏప్రిల్ 10న రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం బ్యాంకులు ఉండవు.
13వ తేదీ ఊగాది బ్యాంకులకు సెలవు. 14వ తేదీ అంబేడ్కర్ జయంతి, 18వ తేదీ ఆదివారం, 21వ తేదీ శ్రీరామనవమి, 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు. బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని ముందు తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది.
Share your comments