News

Bathukamma : బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్ !

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆదివారం తో ప్రారంభం కానున్నఈ పండుగ 9 రోజుల పాటు కొనసాగుతుంది . మొదటి రోజు ఎంగిలి పులా బతుకమ్మ తో మొదలై 9 వ రోజు సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది .

బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి నృత్యాలు, పాటలు పాడుతూ పండుగను జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణలో ఆదివారం నుంచి పూల పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని , రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి నృత్యాలు, పాటలు పాడుతూ పండుగను జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు .

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని , తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రజలు ప్రకృతిని ప్రార్థిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

సెప్టెంబర్ 30 నాటికీ PM కిసాన్ 12 వ విడత విడుదలకు అవకాశం !

రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లతో మహిళలకు చీరలు పంపిణీ చేస్తోంది . మహిళల పట్ల గౌరవ సూచకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన కోటి చీరలను బతుకమ్మ కానుకగా అందజేస్తోందని తెలిపారు.

బతుకమ్మ పండుగ ప్రజల జీవితంలో భాగమైందని, ప్రస్తుతం తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు .

సెప్టెంబర్ 30 నాటికీ PM కిసాన్ 12 వ విడత విడుదలకు అవకాశం !

Share your comments

Subscribe Magazine

More on News

More