రైతుల కోసం రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఒక్కో ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే.. ఎకరానికి రూ.4వేలు రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ అవుతాయి. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు.
గత మూడు సంవత్సరాల్లో రైతు బంధు పథకానికి రూ. 35,676 కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 59.26 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. ఇక రైతు బంధు యోజన పథకం కోసం రూ.2,938.6 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రైతు బంధు బీమా పథకం ద్వారా 47,168 రైతు కుటుంబాలు రూ.2,358.15 కోట్లు లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లబ్ధి పొందాయన్నారు. రైతులు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైతు బంధు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ పథకం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
అటు మూడు సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు నిరంజన్ రెడ్డి చెప్పారు
Share your comments