News

Neem Juice Benefits : వేసవిలో వేప జ్యూస్ త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు !

Srikanth B
Srikanth B

Neem Juice Benefits In Summer : వేసవిలో వేప సర్వరోగ నివారిణి అని మీరు వినే ఉంటారు. అయితే వేప జ్యూస్ కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మీ చర్మం కూడా మెరుస్తుంది.

Neem Juice Benefits For Skin In Summer  : వేప ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. మీ స్కిన్ ఎలర్జీ వస్తే వేప నీటితో స్నానం చేస్తే అది పోతుంది.  వేప జ్యూస్ (Neem Juice Benefits In Summer ) తాగడం వాళ్ళ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . ఇది బరువును నియంత్రించడంలో, చర్మాన్ని కాంతి వంతంగా ఉంచడానికి దోహదపడుతుంది ,అంతేకాకుండా వేప జ్యూస్ వల్ల ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.

మీకు చర్మ సంబంధిత  వ్యాధులు ఉన్నట్లయితే, చాలా మంది  వేప నీటితో స్నానం చేయాలని సిఫార్సు చేస్తారు. వేప రసం కూడా దీనికి తక్కువ కాదు . ఈ రసం చేదుగా అనిపించినప్పటికీ, ఇది మీ ఆరోగ్యానికి చాలా చాల ఉపకారం చేస్తుంది . ఇది బరువును నియంత్రించడంలో మరియు చర్మాన్ని రిఫ్రెష్ చేయడంలో కూడా మేలు చేస్తుంది. ఇంతే కాకుండా వేప రసం తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

చిగుళ్ల సమస్యకు చక్కటి  ఉపశమనం

చిగుళ్ల సమస్యను దూరం చేసేందుకు వేప జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. నిజానికి వేప జ్యూస్ తాగడం వల్ల చిగుళ్లు, దంతాల సమస్య తగ్గుతుంది. మన దేశంలో శతాబ్దాలుగా పళ్లు శుభ్రం చేసుకోవడానికి వేపపుల్లను వాడుతున్నాం. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా మీరు వేప జ్యూస్ మౌత్ వాష్‌గా ఉపయోగిస్తే మీ చిగుళ్ల సమస్యను పొగట్టడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.

ముఖం సహజ కాంతి కోసం

చర్మంపై సహజం గ మెరవాలంటే వేప జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి . దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరంలోని విషపదార్థాలు

 కూడా బయటకు పోతాయి. శరీరంలో ఉండే మురికిని తొలగించడం వల్ల చర్మం సహజం గ   మెరుస్తుంది.

బరువు అదుపులో ఉంచడానికి

వేప జ్యూస్ బరువును (Weight loss) నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, దాని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  అదే విధంగా మీ శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఇది మీ బరువును చాలా వేగంగా తగ్గిస్తుంది.

Adding Fruits In Breakfast: ఖాళీ కడుపుతో పండ్లు తింటే ప్రమాదమా ? (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More