News

పాడి పశువులకు దాణాలో ఉప్పు అందించవచ్చ ?

Srikanth B
Srikanth B

చాల మంది పాడి రైతులు ఆవు , గేదెల పోషణలో భాగంగా ఉప్పును అందిస్తుంటారు మరికొంతమంది ఉప్పును పశువులకు ఇవ్వాళ వద్ద  అన్ని సందేహిస్తారు అయితే పాడి పశువులకు  పోషణలో భాగం గ ఉప్పును ఇవ్వడం ఎంత వరకు సరైనది అనే విషయాన్నీ మనం ఇప్పుడు  తెలుసుకుందాం.

ఉప్పులో వుండే పోషకాలు :

ఉప్పులో లభించే మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఉప్పు తీసుకోవడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అది మానవ శరీరమైనా, జంతువు శరీరమైనా సరే. మనం గేదె గురించి మాట్లాడితే, గేదె ఆహారంలో

 కూడా సరైన మొత్తంలో ఉప్పు ఉండాలి (జంతువుల పోషణలో  ఉప్పు లోపించడంవల్ల  గేదెల్లో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది , కాబట్టి మీరు పశుపోషణ చేస్తే, రోజూ గేదెకు ఇచ్చే ఆహారంలో సరైన మోతాదులో ఉప్పు వుండే విధం గ జాగ్రత్తలు తీసుకోవాలి . సరైన మోతాదులో ఉప్పు అందించక పోవడం వల్ల పశువులకు సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడి  పశువులు  బలహీనం గ మారవచ్చు .

 

జంతువుల పోషణకు ఉప్పు చాలా అవసరం)

గేదెల ఆహారంలో ఉప్పు విలువ చాలా ముఖ్యమైనది. అవును, గేదెల గురించి మాట్లాడుతూ, వాటిలో ఉప్పు పరిమాణం జీర్ణం అయ్యే ప్రక్రియకు చాలా దోహదపడుతుంది. ఉప్పు ను వినియోగించడం వల్ల జంతువుల ఆకలి పెరుగుతుంది . దీని వినియోగం జంతువులలో నెమరువేసే   ప్రక్రియలో సహాయపడుతుంది. ఉప్పు పరిమాణం వాటి  శారీరక విధులను బాగా ప్రభావితం చేస్తుంది.

ఉప్పు లోపం వల్ల వచ్చే వ్యాధులు:

ఉప్పు లేకపోవడం వల్ల గేదెల్లో పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. దీనితో పాటు ఆవులు, గేదెలకు మూత్ర వ్యాధులు వచ్చేఅవకాశాలు అధికంగా వున్నాయి.

ఇది కాకుండా ఉప్పు లేకపోవడం వల్ల జంతువుల ఆకలి కూడా తగ్గుతుంది. గేదె ఆహారంలో ఉప్పు లోపిస్తే, అప్పుడు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పశువులకు రోజువారీ దాణా లో భాగంగా ఉప్పును అందించండి .

రోజుకు 33. 8 లీటర్ల పాలు చరిత్ర సృష్టించిన గేదె ! (krishijagran.com)

ఈ 5 మేక జాతులను పెంచడం ద్వారా అధిక లాభాలు పొందండి ! (krishijagran.com)

 

Related Topics

animalhusbendry buffalo cow

Share your comments

Subscribe Magazine

More on News

More