ప్రస్తుతం రైతులు తమ వ్యవసాయ పనులలో ఎంతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలోనే రాత్రింబవళ్ళు పొలంలోనే తమ జీవితాన్ని గడుపుతుంటారు.ప్రస్తుతం వర్షాకాలం కారణంగా వర్షం పడగానే ఇన్ని రోజులు భూమి లోపలలో దాగి ఉన్న విషసర్పాలు బయట సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే పొలాల్లో తిరిగే రైతన్నలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఎవరైనా పాముకాటుకు గురైతే ధైర్యంతో,మసులుకోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పుతుంది అని అధికారులు తెలియజేస్తున్నారు.
పొరపాటున ఎవరైనా పాముకాటుకు గురైతే వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా పాముకాటుకు గురైన వ్యక్తిని సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి సరైన చికిత్స చేయించడం వల్ల ప్రాణాలతో బయట పడవచ్చు.అలా కాదని నాటు వైద్యం, నాటు మందులు అంటూ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది.
రాత్రి సమయంలో పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనం నడుస్తూ వెళ్లేటప్పుడు శబ్దం చేసుకుంటూ వెళ్లడం వల్ల పాములు దూరంగా వెళ్లిపోతాయి. ముఖ్యంగా ధాన్యం నిల్వ చేసిన చోట, తడి ప్రాంతాలలో,గడ్డివాము దగ్గర ఎక్కువగా కప్పులు సంచరిస్తుంటాయి కనుక ఆ ప్రదేశాలలో పాములు కూడా అధికంగా తిరుగుతుంటాయి రైతులు ఇటు వంటి ప్రదేశాలలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమవుతారు.ఈ క్రమంలోనే తప్పకుండా పాదరక్షకాలు ధరించి వ్యవసాయ పనులు చేయాలి. పాము కాటు వేసిన చోట రెండు కోరల గాయం కనిపిస్తుంది. నొప్పి తట్టుకోలేం. నొప్పి క్రమంగా పైకి వ్యాపించి తిమ్మిరిగా అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటే వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
Share your comments