ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈనెల 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (All India Backward And Minority Communities Employees Federation) మే 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్రం కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించనందుకు నిరసనగా, బంద్‌కు ఫెడరేషన్ పిలుపునిచ్చినట్టు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ (Neeraj Dhiman) తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం తదితర అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను నీరజ్ కోరారు. బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు డిపి సింగ్ కూడా భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
భారత్ బంద్ చేపట్టడానికి గల కారణాలు:
కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం
ఈవీఎం కుంభకోణం
ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు
రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయాలి
NRC/CAA/NPRకి వ్యతిరేకంగా
పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించాలి
మధ్యప్రదేశ్ మరియు ఒడిశాలో పంచాయితీ ఎన్నికలలో OBC రిజర్వేషన్లలో ప్రత్యేక ఓటర్లును అమలు చేయాలి
పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజనుల నిర్వాసితులకు వ్యతిరేకంగా
టీకాపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా
లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికులపై చేసిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, మే 25న వ్యాపారాలు మరియు ప్రజా రవాణాను మూసివేయాలని సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
మరిన్ని చదవండి.
Share your comments