News

నేడు భారత్ బంద్ …కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం పిలుపు!

Srikanth B
Srikanth B
Bharat Bandh today
Bharat Bandh today

నేడు భారత్ బంద్: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం పిలుపునిచ్చిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్) సోమవారం (మార్చి 28, 2022) ప్రారంభమైంది మరియు బ్యాంకింగ్, రవాణా, రైల్వేలు మరియు విద్యుత్కు సంబంధించిన కొన్ని అత్యవసర సేవలకు  అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ఐఎన్ టియుసి, ఎఐటియుసి, హెచ్ ఎంఎస్, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసిసి, సేవా, ఎఐసిసిటియు, ఎల్ పిఎఫ్ మరియు యుటియుసితో సహా కార్మిక సంఘాలు కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణకు నిరసనగా  ఎంఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కింద వేతనాల కేటాయింపులు పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించడం వంటి ప్రధాన డిమాండ్లతో నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి .

ప్రభుత్వ విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది అధికారిక, అనధికారిక కార్మికులు సామూహికంగా తరలివస్తారని ఆశిస్తున్నామని ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ప్రముఖ  వార్తా సంస్థకు తెలిపారు.

దేశవ్యాప్తంగా  చేపట్టనున్న ఈ  కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలను కూడా తాకుతుందని, అక్కడ వ్యవసాయం మరియు ఇతర రంగాలకు చెందిన అనధికారిక కార్మికులు ఈ నిరసనలో పాల్గొంటారని ఆమె అన్నారు.

బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బ్యాంకులు, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మె నోటీసులను ఇచ్చాయి.

రైల్వే, రక్షణ రంగంలోని యూనియన్లు సమ్మెకు మద్దతుగా పలు చోట్ల సామూహిక సమీకరణ చేపడతాయని సంయుక్త ఫోరం తెలిపింది.

తెలంగాణ :ఖమ్మం మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర!

మోదీ నోట హైదరాబాద్ మాట.

Share your comments

Subscribe Magazine

More on News

More