కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకం ద్వారా భారత్ బ్రాండ్ అనే ఎరువులను తీసుకొచ్చినది . దీని ద్వారా రైతు ఒక ఎరువు కు ఎక్కడైనా ఒకే ధరకు ఎరువులను అందించనున్నది.
భారతీయ జన ఊర్వరక్ ప్రయోజన పథకం (పీఎంబీజేపీ) పేరుతో పాటు భారత్ యూరియా అని పెద్ద అక్షరాల్లో బస్తాలపై ముద్రించి ఉంటుంది . ఆ బస్తాలను విక్రయించే వివిధ కంపెనీల పేర్లు మాత్రం చిన్న అక్షరాల్లో ముద్రించి ఉంటాయి. ఎరువుల దుకాణాల బోర్డులను కూడా భారతీయ జన్ ఊర్వరక్ పరియోజన - ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం - భారత్ యూరియా పేరుతో ప్రదర్శించాల్సి ఉంటుంది. వ్యవసాయం కోసం రైతులు కొనుగోలు చేసే వివిధ రకాల రసాయనిక ఎరువులపై కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయితీలు అందిస్తోంది. ఆ రాయితీలన్నిటినీ అందుకుంటున్న కంపెనీలు బస్తాలపై తమ పేర్లు ముద్రించుకోవటమే కాకుండా డిమాండ్‌కు అనుగుణంగా తమ ఇష్టానుసారం ధరలను ప్రకటించి రైతులకు విక్రయిస్తున్నాయి.
ఎరువులను విక్రయించే అన్ని దుకాణాలను ఇకపై ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎంకేఎస్కే) గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సుమారు 3.3 లక్షల ఎరువుల దుకాణాలున్నట్టు అంచనా. గత ఏడాది చివరినాటికి సుమారు 30 వేల దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్పు చేయగా.. ఈనెలలో 1.8 లక్షలు, ఫిబ్రవరి మరో 1.7 లక్షల దుకాణాల పేర్లను మార్పు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
రైతుల PM కిసాన్ నిధి రూ.8,000కి పెంపు – వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల!
దీని వల్ల ప్రభుత్వం అందించే సబ్సిడీ రైతులకు అందకుండా పోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం భారతీయ జన ఊర్వరక్ ప్రయోజన పథకం (పీఎంబీజేపీ) క్రింద వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకం ద్వారా భారత్ బ్రాండ్ అనే ఎరువులను తీసుకొచ్చింది , గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా 2022 అక్టోబరు 2నే ప్రధానమంత్రి అయితే ఇప్పటికి కంపెనీలు తమ పాత స్టాక్ ఉందని ఎరువుల విక్రయిస్తుంది అయితే త్వరలోనే దీనికి తెర పడనుంది .
Share your comments