తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EMCET ) 2022 కోసం హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అభ్యర్థులు దరఖాస్తు తమ దరఖాస్తు లను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు .
TS EMCET ) 2022 :తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఫార్మసీ) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EMCET) 2022 కోసం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH ) మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అభ్యర్థులు ఇంజినీరింగ్(TS EMCET ) 2022 (ఈ) స్ట్రీమ్ లేదా అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఏఎం) స్ట్రీమ్కు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.400 ఫీజు చెల్లించాలి. ఈ, ఏఎం స్ట్రీమ్లకు హాజరయ్యే అభ్యర్థులు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్ సీహెచ్ ఈ) తరఫున జేఎన్ టీయూహెచ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశానికి టీఎస్ EMCET నిర్వహిస్తోంది.
ఈ ఏడాది జూలై 14, 15 తేదీల్లో(TS EMCET ) 2022 ఏఎమ్ స్ట్రీమ్ జరగనుంది. జూలై 18, 19, 20 తేదీల్లో ఈ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 14, 18, 19 తేదీల్లో రెండు సెషన్లలో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) పరీక్ష జరగనుండగా, జూలై 15, 20 తేదీల్లో కేవలం ఒక సెషన్ (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) మాత్రమే ఉంటుంది.
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు (TS EMCET ) 2022 పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,21,480 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఫార్మసీ) విభాగంలో 73,070 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత శాతం 82.08 శాతం కాగా, ఏ అండ్ ఎం స్ట్రీమ్ లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
కాగా, జేఈఈ-మెయిన్ పరీక్షా మరియు (TS EMCET ) 2022 రేడు ఒకే రోజు ఉండకుండా ఉండేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలను మరోసారి రీషెడ్యూల్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మే 6 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 7 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
TS TET Update :Telangana TET నోటిఫికేషన్ విడుదల ... దరఖాస్తు చేసుకోండి !
Share your comments