మీరు గుర్రపుడెక్క మొక్కలను ఎప్పుడైనా చూశారా? ఈ గుర్రపుడెక్క మొక్కలు ఎక్కువగా చెరువులలో, నీటి కుంటలలో ఎక్కువగా పెరిగి పోతూ ఉంటాయి. సాధారణంగా ఇవి పనికిరావు అని చాలా మంది భావిస్తారు. ఈ విధంగా పనికిరావని భావించిన ఈ గుర్రపుడెక్క లు ప్రస్తుతం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటి ద్వారా అధిక మొత్తంలో లాభాలను తీసుకుంటున్నారు. ఈ విధమైనటువంటి మొక్కలు చెరువులలో కనిపిస్తే చెరువులో నీటిలో ఉన్న విషపదార్థాలను పీల్చుకుంటుంది. అదేవిధంగా నీటిలో ఉన్న ఆక్సిజన్ కూడా పిలుచుకోవడం చేత ఆ చెరువు లో చేపలకు ప్రమాదం వాటిల్లుతుంది.
ఈ విధంగా కొంతమేర లాభనష్టాలు ఉన్న ఈ గుర్రపు డెక్క మొక్కలు ప్రస్తుతం ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ గుర్రపుడెక్క మొక్కలతో వ్యాపార అభివృద్ధి చేసుకుని లక్షలలో ఆదాయాలను పొందుతున్నారు అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బీల్ గ్రామం చుట్టూ నివసిస్తున్న ప్రజలు. ఈ గ్రామంలోని కొందరు బాలికలకు నార్త్ ఈస్ట్ టెక్నాలజీ అప్లికేషన్.. లెర్నింగ్ సెంటర్ (NECTR) ద్వారా యోగమ్యాట్స్ తయారు చేయడానికి శిక్షణ ఇచ్చింది.
ఈ విధంగా గుర్రపుడెక్క మొక్కలతో యోగమ్యాట్స్ తయారు చేసి వాటిని ‘మూర్హెన్ యోగా మత్’ అని పేరు పెట్టారు. ‘మూర్హెన్ ‘అంటే వలస పక్షి అని అర్థం. ఈ పక్షి గుర్రపుడెక్కలు పెరుగుతున్నటువంటి దీపోర్ సరస్సుకు రావడం వల్ల వీరు చేసేటటువంటి యోగమ్యాట్స్ కి అదే పేరు పెట్టారు. ఈ విధంగా సహజసిద్ధంగా పెరిగిన టువంటి మొక్కల నుంచి తయారు చేయబడిన ఈ
యోగమ్యాట్స్ 100 బయోడిగ్రేడబుల్. ఇలా పనికిరాని మొక్కల నుంచి ఉపాధిని కల్పించుకుని ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ వ్యాపారం ద్వారా లక్షలలో డబ్బును పొందడమే కాకుండా ఎంతో మంది ఉపాధిని కల్పించుకోవడం విశేషం.
Share your comments