News

వేములవాడ లో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్

Srikanth B
Srikanth B
వేములవాడ లో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
వేములవాడ లో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆవు, కోడెల పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి అయ్యింది. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం నిధులు రూ.31 లక్షల 60 వేల తో ఈ ప్రాజెక్టు నిర్మించారు.

 

ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మొట్ట మొదటి ఆవు పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్
నిర్మాణ పనులు 3 నెలల క్రితం క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ ప్లాంట్‌లో బయోగ్యాస్‌ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు 2.5 టన్నుల పశువుల పేడను వినియోగించనున్నారు.

ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ను గోశాలను ఆనుకుని ఉన్న వేములవాడ ఏరియా ఆసుపత్రి తో పాటు ఆలయ ఎలక్ట్రిసిటీ అవసరాలను తీర్చనుంది. పశువుల పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ ఇన్స్టలేషన్ పనులను తమిళనాడు కు చెందిన సుందరం ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తుండగా పర్యవేక్షణ బాధ్యతలను వేములవాడ మున్సిపాలిటీ చూస్తుంది.

అర్హులకు ప్రభుత్వ పథకాలు త్వరగా అందించాలే -CS శాంతి కుమారి

ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే పక్కనే ఉన్న ఏరియా హాస్పిటల్ ఎలక్ట్రిసిటీ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా ఆలయ అవసరాలకు కూడా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్లాంట్ ను రేపు మంత్రి KTR ప్రారంభించనున్నారు.

అర్హులకు ప్రభుత్వ పథకాలు త్వరగా అందించాలే -CS శాంతి కుమారి

Related Topics

cow dung

Share your comments

Subscribe Magazine

More on News

More