News

Bird flu outbreak in Telugu states: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ... పౌల్ట్రీ రైతులకు భారీ నష్టం

KJ Staff
KJ Staff

ఆదివారం వస్తే జనం అంత చికెన్ షాపుల ముందు బారులు తీరుతారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ దృశ్యం సర్వ సాధారణం. కానీ ఈ మధ్య కాలంలో అతి వేగంగా విజృభిస్తున్న బర్డ్ ఫ్లూ మాంసాహార ప్రియులకు అడ్డుకట్టగా తయారైంది. ముఖ్యముగా కోళ్ల ఫారాల రైతులకు బర్డ్ ఫ్లూ ఒక గుదిబండగా మారింది. మార్కెట్ లో కోళ్లకు గిరాకీ తగ్గిపోవడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాన్ని చవిచుస్తున్నారు. వారు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అని వాపోతున్నారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 7, 2024 న, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీస్, జరిపిన పరీక్షల్లో కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వ్యాధి రావడానికి కారణం H5N1 స్ట్రైన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్. కొన్ని సమీక్షా చర్చల తర్వాత అధికారులు నెల్లూరులోని చికెన్ షాపులు మూసివేయాలి అని యజమానులకు సూచించారు. పౌల్ట్రీ కోళ్లను, కోడి గుడ్లను అమ్మడాన్ని నిషేదించారు.

బర్డ్ ఫ్లూకి ముఖ్య కారణాలు:

ప్రతి సంవత్సరం తిరుపతి జిల్లాలోని, పులికాట్ లేక్ వద్దకు వలస వచ్చే పక్షులు ఈ బర్డ్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణం అని అధికారులు అనుమానిస్తున్నారు. అతి ముఖ్యంగా వాటర్ ఫౌల్ అనే పక్షి ఈ వ్యాధిని మోసుకు వస్తుంది అని భావిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ నివేదిక ప్రకారం బర్డ్ ఫ్లూ మనుషుల్లో అతి కొద్దీ మంది లో మాత్రమే గమనించారని కానీ వ్యాధి సోకినా వ్యక్తుల్లో 50% కంటే ఎక్కువ మంది లో మరణాలు నమోదు అయ్యాయి అని WHO తెలియచేసింది.

బర్డ్ ఫ్లూ ను గుర్తించడం ఎలా:

బర్డ్ ఫ్లూ ఒక పక్షి నుండి మరొక పక్షికి అతి వేగంగా ప్రయాణిస్తుంది. వ్యాధి సోకినా అతి కొద్దీ గంట్లలోనే లక్షణాలు కనబడటం ప్రారంభం అవుతాయి . లక్షణాలు కనిపించే పక్షులను ముందుగానే గుర్తుంచి తొలగించడం వళ్ళ మిగతా పక్షులకు అంటకుండా నివారించవచ్చు.

బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం

  • కోళ్ళలో డయేరియా.
  • గుడ్డు పెంకు సర్రిగ్గా ఎర్పడకపోవడం
  • కనుగుడ్లు, తల ఉబ్బిపోవడం,
  • మేత తినకపోవడం
  • మొదలయినవి కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలు చూపించే కోళ్లను తొలగించడం వళ్ళ మిగతా కోళ్లను కాపాడుకోవచ్చు

Related Topics

#Birdflu #Poultry #Chicken

Share your comments

Subscribe Magazine

More on News

More