నల్ల తామర తెగులు అంతర్జాతీయంగా పేరు పొందిన కొల్లాపూర్ మామిడికి చాల నష్టం కలిగిస్తుంది. మామిడి తోటలకు క్రమంగా మూడోసారి కూడా ఈ రోగం సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడిపూత రంగు నల్లగా మారి తెట్టలు తెట్టలుగా రాలిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతున్నారు. నల్ల తామర తెగులు నివారణ కోసమని లక్షలు ఖర్చు పెట్టిమరి క్రిమిసంహారక మందులను స్ప్రే చేసిన ఫలితం రావట్లేదని చెబుతున్నారు. తెగుళ్ల కారణంగా మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా రెండేళ్ల నుండి నష్టపోతున్నమని, ఈ ఏడాది కూడా నల్ల తామర తెగులు వాళ్ళ నష్టాల నుండి తేరుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు చెప్పిన రసాయనాలు అన్ని పిచికారీ చేస్తున్నారు. ఇదికాకుండా కొంత మంది రైతులు ఐతే వేప నూనె, కషాయాలు వంటి సేంద్రియ పద్దతులను కూడా పాటిస్తున్నారు. ఇంత చేసినా తెగులు మాత్రం అదుపులోకి రావట్లేదని, గత రెండుససంవత్సరాలుగా ఇదే పరిస్థితి అని, ఉద్యానవాన అధికారులు సూచించిన మందులు పనిచేయడం లేదని అంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పరిష్కారం చుపించాలిని కోరుతున్నారు.
కేవలం ఒక్క కొల్లాపూర్ లోనే 35 హెక్టార్లో మామిడి..
ఉమ్మడి జిల్లాలో మొత్తానికి 50 వేళా హెక్టార్లలో మామిడి సాగు ఉండగా, కేవలం ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 35 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడి రైతులు బంగినపల్లి, నూజివీడు తర్వాత కొల్లాపూర్ బేనిషాకు ఆస్థాయిలో అంతర్జాతీయ గుర్తిపు ఉన్నందున మామిడిని పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. సొంత పొలం ఉన్న రైతులు మాత్రమే కాకుండా లక్షలు ఖర్చుపెట్టి కౌల రైతులు కూడా మామిడి సాగు చేస్తున్నారు. ఇదివరకు మార్కెట్లో డిమాండ్ బాగుండడంతో రైతులకు లాభాలు కూడా బాగానే వచ్చేవి., కానీ మూడేళ్ళ కిందట నల్ల తామర తెగులు సోకి దిగుబడి తగ్గి నష్టాలు మొదలయ్యాయి. పూతలోని రసాన్ని ఈ పురుగు పీల్చేయడంతో పూత రాలిపోతుంది మారియు పిందెలు ఉన్నచోటే పసుపు రంగులోకి మరి రాలిపోతున్నాయి.
ఇది కూడా చదవండి..
యాసంగి వరిలో ఉధృతమవుతున్న కాండం తొలిచే పురుగు - యాజమాన్యం నివారణ చర్యలు ...
హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇటీవల రైతుల ఫిర్యాదుల మేరకు మామిడి తోటలను పరిశీలించి పలు రకాల మందులను వాడమని సూచించారు. మంచు మరియు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నల్ల తామర, భూడిద తెగుళ్లు సోకి మామిడి పూత రాలిపోతుందని ఆయన తెలిపారు. నల్ల తామర తెగులును నివారించేందుకు థయోమిథాగ్రైమ్ 150 గ్రాములు + హెక్సాకొనోజోల్ 1 లీటరు 50క్వి. లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని సూచించారు.
బుడిద తెగులు, పూత నల్లగా మారడంతో పాటు, తామర పురుగుల బాధ ఎక్కువగా ఉంటే కనుక ఫిప్రోనిల్ 40% + ఇమిడాక్లోప్రిడ్ 40% డబ్ల్యూజీ పోలీస్ 150 గ్రాములు + టిబ్యుకోనజోల్ + త్రిఫ్లక్సీస్టార్బిస్ 250 గ్రాములు 500 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments