క్యాన్సర్ ఎంత ప్రాణాంతకమైన వ్యాధో మనందరికీ తెలుసు. ప్రపంచంలో సంభవించే అనేక మరణాలకు ఈ క్యాన్సర్ వ్యాధి కారకం. శరీరంలో ఎన్నో భాగాలకు ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ సోకినా కణాలు అసాధారణంగా పెరుగుతాయి. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలున్నాయి, కొన్ని చెడు అలవాట్లైన గుట్క, సిగరెట్ తాగడం, మద్యం సేవించడం మొదలైన అలవాట్లు క్యాన్సర్ కారకం కావచ్చు. అయితే ఈ అలవాట్లు ఉన్నవారికి మాత్రమే క్యాన్సర్ వస్తుందా అంటే అది నిజం కాదు. ప్రస్తుతం వాతావరణ మార్పు కూడా కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి కారణమవుతుందని తేలింది.
క్యాన్సర్ శరీరంలోని ఎన్నో భాగాలకు సోకవచు. క్యాన్సర్ వ్యాధిని ఆరంభంలోనే గుర్తిస్తే వ్యాధిని అరికట్టడం సులభమవుతుంది. వ్యాధి ప్రభలమయ్యే ముందు కొన్ని లక్షణాలు కనిపించడం సహజం. వాటిని ఘటించి వైద్య పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నుండి తొందరగా బయట పడవచ్చు. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ ఒకటి. ప్రజల్లో బ్లడ్ కాన్సర్ గురించి చైతన్యం నింపి వారిని ఈ వ్యాధి నుండి రక్షించేందుకు ప్రతి సంవత్సరం మే 28 న బ్లడ్ క్యాన్సర్ డే గా పరిగణిస్తారు. బ్లడ్ క్యాన్సర్ ని హిమోటోలోజి మలిగ్నెన్సీ అనికూడా పిలుస్తారు. క్యాన్సర్ రావడానికి ముందు కలిగే కొన్ని మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ కాన్సర్ ఉన్నవారికి రక్తశ్రావం అధికంగా ఉంటుంది, ఉన్నటుంది నోటి నుండి మరియు ముక్కు నుండి రక్తం కారడం, శరీరంలో చిన్న గాయమైన సరే ఆగకుండా రక్తశ్రావం జరగడం ఈ బ్లడ్ క్యాన్సర్ కి సంకేతంగా చెప్పవచ్చు. అంతేకాకుండా చిగుళ్ల నుండి రక్తం కారడం కూడా బ్లడ్ క్యాన్సర్ కు సంకేతమే అని నిపుణులు భావిస్తున్నారు.
బ్లడ్ కాన్సర్ ఉన్నవారికి, శరీరంలో రక్త శాతం చాల తగ్గిపోతుంది. దీనివలన ఎప్పుడు అలసటగా అనిపించడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి. చాల మంది ఉన్నటుంది బరువు తగ్గడం గమనించవచ్చు, ఇది బ్లడ్ కాన్సర్ కి సంకేతం కావచ్చు.
అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారి రక్తంలో తెల్ల రక్త కణాలు సంఖ్యా తగ్గిపోవడం జరుగుతుంది. తెల్ల రక్తకణాలు ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది, ఈ కణాలు తగ్గిపోవడం వలన తరచూ ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఉంది. దీనితో పాటు నిరంతం వెన్ను భాగం మరియు పక్కటెముకులలో నొప్పి రావడం కూడా బ్లడ్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. ఇటుంటి లక్షణాలు తరచూ గమనించిన లేదా ఎక్కువగా ఉన్న వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స పొంది మీ ప్రాణాలను కాపాడుకోండి.
Share your comments