కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారానికి కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో చింతపండు నవీన్ అనే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన గొంతు కాంగ్రెస్ పార్టీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతో, ఇన్ని రోజులు బిజెపిలో ఉన్న తీన్మార్ మల్లన్న తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎఐసిసి తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్ రావ్ తక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ తీన్మార్ మల్లన్నకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వయంగా తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి టిక్కెట్ల అమ్మకం పద్ధతుల్లో నిమగ్నమై ఉన్నారని మరియు బీసీలను (వెనుకబడిన తరగతులు) అవమానించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..
ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇవ్యాల మరోసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. దీంతో తీన్మార్ మల్లన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీన్మార్ మల్లన్నను ఇంకా ఎన్ని పార్టీలు మారతారని ప్రశ్నిస్తూ, పరిస్థితిని చుట్టుముట్టిన వివాదాన్ని మరింత పెంచారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అలెర్ట్. హైదరాబాద్‌లోని వాతావరణ శాఖలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 72 గంటల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు, అలాగే ఉత్తర తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..
Share your comments