News

రైతులకన్నా దళారులే లాభపడుతున్నారు - మాజీ సీజేఐ సదాశివం

Srikanth B
Srikanth B
రైతులకన్నా దళారులే లాభపడుతున్నారు - మాజీ సీజేఐ సదాశివం
రైతులకన్నా దళారులే లాభపడుతున్నారు - మాజీ సీజేఐ సదాశివం

ఢిల్లీ :తాజగా కృషి జాగరణ్ నిర్వహించిన KJ చౌపాల్ కార్యాక్రమంలో మాజీ చీఫ్ చీఫ్ జస్టిస్ (CJI ) సదాశివం పాల్గొన్నారు. 40 వ ప్రధాన న్యాయ మూర్తిగా వ్యవహరించిన (CJI ) సదాశివం వ్యవసాయ రంగంతో తనకు ఉన్న అనుబంధాన్ని , తాను ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్నప్పుడు వెలువరించిన కొన్ని ప్రముఖమైన తీర్పుల గురించి కృషి జాగరణ్ బృందంతో పంచుకున్నారు .


ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ చీఫ్ చీఫ్ జస్టిస్ (CJI ) సదాశివం మాట్లాడుతూ రైతుల కన్నా దళారుల సంపాదనే ఎక్కువని , “ఇటీవల, నాకు ప్రధాని మోడీని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన నాకు వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, కార్యక్రమాలకు సంబంధించిన మాన్యువల్‌ను విత్తనాలతో మోదీ, రైతుతో మోదీ అనే మాన్యువల్‌ ఇచ్చారు. హిందీ మరియు ఇంగ్లీషు మినహా అన్ని ప్రాంతీయ భాషలలో ప్రచురించాలని నేను ప్రధానిని కోరాను ,రైతులకు పూర్తి స్థాయి పథకాలను పై అవగాహన కల్పించే విధంగా గ చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రైతులకు అందించే పంట భీమా పథకంలో ఒక నిబంధన సవరించాలని ,ఈదురుగాలులు ప్రభావంతో రైతు పంట నష్టపోతే ఈ ఈదురుగాల ప్రభావం మండలం మొత్తం పై ఉండాలనే నిబంధన కారణంగా రైతులు పంట భీమా పొందలేక పోతున్నారని ఈ నిబంధనను మర్చి గ్రామస్థాయికి ఈ నిబంధనను సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌: జూన్ 24 వరకు ఒక్కపూట బడులు..

 

ఈ కార్యక్రమంలో కృషి జాగరణ్ మీడియా ఎడిటర్-ఇన్-చీఫ్ మరియు ఫౌండర్ డొమ్నిక్, సైనీ డొమ్నిక్, సోనాలికా గ్రూప్ సిఇఒ బిమల్ కుమార్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ సేథీ, మాజీ డిడిజి (యానిమల్ సైన్సెస్-ఐసిఎఆర్) కూడా పాల్గొన్నారు.

కృషి జాగరణ్ వ్యవస్థాపకులు డొమినిక్ అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయుల మధ్య మాజీ గవర్నర్ సదాశివం తన వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సవివరంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌: జూన్ 24 వరకు ఒక్కపూట బడులు..

Related Topics

Krishi Jagran office

Share your comments

Subscribe Magazine

More on News

More